పోలీస్ స్టేష‌న్‌లో న‌గ్నంగా `రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌`

టాలీవుడ్ లో ఇప్పుడు రెండు ర‌కాల సినిమాలే త‌యార‌వుతున్నాయి. ఓటీటీలో అవే విడుద‌ల అవుతున్నాయి. ఒక‌టి రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న సినిమాలు, రెండోది రాంగోపాల్ వ‌ర్మ‌పై తీస్తున్న సినిమాలు. బ‌యోపిక్‌ల పేరుతో.. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు అని చెప్పి, దానికి మంచి మ‌సాలా జోడించి, కావ‌ల్సినంత ప‌బ్లిసిటీ తెచ్చుకుని – టికెట్లు తెంచుకోగ‌లుగుతున్నాడు వ‌ర్మ‌. ఇప్పుడు అదే దారిలో.. వ‌ర్మ‌పైనా సినిమాలు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ఆర్జీవీపై `ప‌రాన్న జీవి` అనే సినిమా తీశారు. జొన్న‌విత్తుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రెడీ అవుతోంది. ఇప్పుడు `రాడ్‌ గోపాల్ వ‌ర్మ` అంటూ మ‌రో సినిమా వదులుతున్నారు.

ఇందులో ఆర్జీవీ.. `శివ‌` సినిమా ముందు ఎలా ఉండేవాడో చూపించ‌బోతున్నారు. అందుకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది. పంజాగుట్టు పోలీస్ స్టేష‌న్‌లో ఓ వ్య‌క్తి.. న‌గ్నంగా కూర్చున్న ఫొటో అది. `బ్లూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న వ్య‌క్తిని అరెస్టు చేసిన పోలీసులు` అంటూ పేప‌ర్ క‌టింగ్ కూడా జోడించారు. అప్ప‌ట్లో వ‌ర్మ‌.. పంజాగుట్ట‌లో సీడీ షాపు న‌డిపేవాడు. అక్క‌డే సినిమా వాళ్ల‌తో ప‌రిచ‌యాలు మొద‌ల‌య్యాయి. వ‌ర్మ కెరీర్ ప్రారంభాన్ని చాప్ట‌ర్ 1 ద్వారా చూపించ‌బోతున్నారన్న‌మాట‌. మొత్తానికి వ‌ర్మ పై సినిమాని,. వ‌ర్మ దారిలోనే తీయ‌డానికి ఫిక్స‌య్యారు. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్‌: ఓన్లీ ఫ‌ర్ ఫ‌న్‌

https://www.youtube.com/watch?time_continue=1&v=OysGpn9fWM0&feature=emb_logo వ‌రుస హిట్ల‌తో దూసుకొచ్చాడు రాజ్ త‌రుణ్‌. ఎంత వేగంగా వ‌చ్చాడో, అంతే వేగంగా కింద‌కు ప‌డ్డాడు. ఇప్పుడు తాను పైకి లేవ‌డానికి ఓ ఊతం కావాలి. విజ‌య్ కుమార్ కొండా, హెబ్బా ప‌టేల్...

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో టీడీపీ..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అసలు ఉనికి ఉందో లేదో అనే పరిస్థితికి వెళ్లిన తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నాయకత్వ సమస్య ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణపై సీనియర్...

దేవాదాయ మంత్రి వెల్లంపల్లికి కరోనా..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలోనే ఉన్నారు. ఆయన తిరుమల...

రైతులకు జగన్ సర్కార్ ఉచిత బోర్లు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఉచితంగా బోర్లు వేసే పథకానికి వైఎస్ఆర్ జలకళ అనే పేరు పెట్టారు. ఆ పథకాన్ని సోమ వారం నుంచి ప్రారంభిస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close