పుస్త‌క రూపంలో ‘పూరీఇజం’

పూరి సినిమాల్లో డైలాగులు ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సూటిగా, గుండెని తాకేలా రాయ‌గ‌ల‌డు. అవ‌న్నీ సినిమాల‌కే ప‌రిమితం కాదు. త‌న జీవ‌న శైలే అలా ఉంటుంది. పూరి ఎప్పుడు, ఎక్క‌డ మాట్లాడితే త‌న భావ‌జాలం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటుంది. దాన్ని పూరి అభిమానులు `పూరీఇజం` అంటుంటారు.

తాజాగా.. పాడ్ కార్డ్స్ పేరుతో.. పూరి కొన్ని కొటేష‌న్లు చెబుతున్నాడు. స్నేహం, డ‌బ్బు, స్వార్థం, దేవుడు, ప్రేమ‌, బ్రేక‌ప్ .. ఇలా ర‌క‌ర‌కాల టాపిక్కుల మీద మాట్లాడుతున్నాడు. ఇవి కూడా పూరి అభిమానుల‌కు తెగ న‌చ్చేస్తున్నాయి. ఇందులో పూరి భావ‌జాలం మ‌రింత స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లో ఈ కొటేష‌న్లని పుస్త‌క రూపంలోకి తీసుకువ‌స్తున్నాడు పూరి. అందుకు సంబంధించిన స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి కూడా. లాక్ డౌన్‌స‌మ‌యం, పైగా షూటింగులు లేవు. పుస్త‌క ర‌చ‌న‌కు ఇదే అనువైన స‌మ‌యం. పాడ్ కార్డ్స్ లో పొందుప‌ర‌చిన భావాల్ని అక్ష‌రాల‌లో చూడాలంటే… ఈ పుస్త‌కం వ‌చ్చేంత వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్‌: ఓన్లీ ఫ‌ర్ ఫ‌న్‌

https://www.youtube.com/watch?time_continue=1&v=OysGpn9fWM0&feature=emb_logo వ‌రుస హిట్ల‌తో దూసుకొచ్చాడు రాజ్ త‌రుణ్‌. ఎంత వేగంగా వ‌చ్చాడో, అంతే వేగంగా కింద‌కు ప‌డ్డాడు. ఇప్పుడు తాను పైకి లేవ‌డానికి ఓ ఊతం కావాలి. విజ‌య్ కుమార్ కొండా, హెబ్బా ప‌టేల్...

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో టీడీపీ..!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. అసలు ఉనికి ఉందో లేదో అనే పరిస్థితికి వెళ్లిన తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నాయకత్వ సమస్య ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు ఎల్.రమణపై సీనియర్...

దేవాదాయ మంత్రి వెల్లంపల్లికి కరోనా..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలోనే ఉన్నారు. ఆయన తిరుమల...

రైతులకు జగన్ సర్కార్ ఉచిత బోర్లు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకాన్ని అమలు చేస్తోంది. ఉచితంగా బోర్లు వేసే పథకానికి వైఎస్ఆర్ జలకళ అనే పేరు పెట్టారు. ఆ పథకాన్ని సోమ వారం నుంచి ప్రారంభిస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close