టీఆర్ఎస్‌లో గుబులు రేపుతున్న మరో కొత్త పార్టీ..!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల హడావుడి ఏ మాత్రం తగ్గే అవకాశం లేదని టీఆర్ఎస్ వర్గాలు కూడా గట్టిగా నమ్ముతున్నట్లుగా ఉన్నాయి. ఇప్పటికే షర్మిల రాజకీయ పార్టీ రావడం ఖాయమయింది. మరికొంత మంది కూడా పార్టీలు పెట్టే ఆలోచనలో ఉన్నారని టీఆర్ఎస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్‌లో నిరాదరణకు గురవుతున్న ఉద్యమ తెలంగాణ బ్యాచ్‌లోని కొంత మంది ముఖ్యులు ఈ పార్టీ పనిలో ఉన్నారని టీఆర్ఎస్ ముఖ్యులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరోక్షంగా చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొందరు కొత్త పార్టీ పెట్టాలని చూస్తున్నారని.. వేరే పార్టీలకు అవకాశం లేదని గంగుల చెబుతున్నారు. 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి అని తేల్చేశారు.

టీఆర్ఎస్‌లో కొత్త పార్టీలపై ఎక్కువగా గంగుల కమలాకరే స్పందిస్తున్నారు. బహుశా ఆయనకు మాత్రమే హైకమాండ్ పర్మిషన్ ఇచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. షర్మిల పార్టీపై ఇప్పటికే ఘాటు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏ పార్టీ గురించి గంగుల కమలాకర్ మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్‌లో కొంత మంది కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్నారని బయట జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. దీన్ని బట్టి ఈటెల పార్టీపై టీఆర్ఎస్‌లోనూ క్లారిటీ ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో బంగారు తెలంగాణ బ్యాచ్ హవా నడుస్తోంది.

ఉద్యమ తెలంగాణ నేతలకు నిరాదరణ ఎదురవుతోంది. ఉద్యమం చేసి తెలంగాణ సాధించింది తాము అయితే.. ఫలాలు… బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్‌లో చేరిన వారు అనుభవిస్తున్నారని వారుభావిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయం అంత సాఫీగా ఉండబోవడం లేదని… కొన్ని పార్టీలు తెరపైకి రావడం ఖాయమన్న ప్రచారం మంత్రి గంగుల కమలాకర్ మాటలతో మరింతగా ఊపందుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నపై స్టింగ్ ఆపరేషన్..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రైవేటు సంభాషణలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలను వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. ప్రధానంగా...

కర్ణాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు – రాజకీయ కుట్ర ఉందా ?

తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే .... డ్రగ్స్...

టాలీవుడ్ కి ఉగాది శోభ‌

పోయిన ఉగాది... `క‌రోనా` పుణ్యాన రుచీ ప‌చీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోయింది. ఈసారి క‌రోనా భ‌యాలు ఉన్నా... టాలీవుడ్ లో శోభ క‌నిపించింది. ప్ర‌తీ ఉగాదికీ.. టాలీవుడ్ లో కొత్త సినిమాలు మొద‌లు...

బాల‌య్య టైటిల్ `అఖండ`

బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు. బాల‌కృష్ణ సినిమా కోసం ఓ కొత్త టైటిల్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ...

HOT NEWS

[X] Close
[X] Close