ఈ సంక్రాంతి మామూలుగా ఉండ‌దు

అటు మ‌హేష్ బాబు – ఇటు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
ఇద్ద‌రూ టాలీవుడ్ సూప‌ర్ స్టార్లే.
ఇద్ద‌రూ.. రికార్డు వీరులే.
అలాంటిది ఇద్ద‌రి సినిమాలూ ఒకే సీజ‌న్‌లో వ‌స్తే..
నువ్వా? నేనా? అని పోటీ ప‌డితే – బాక్సాఫీసుకి పండ‌గే. ఓ స‌గ‌టు సినీ అభిమానికి ఇంత కంటే కావ‌ల్సింది ఏముంటుంది? 2022 సంక్రాంతికి వీరిద్ద‌రి సినిమాలూ వ‌చ్చేస్తున్నాయ్‌. 2022 సంక్రాంతి మామూలుగా ఉండ‌దు.. అనే సంకేతాలు పంపించేస్తున్నాయ్‌.

సంక్రాంతి అంటే ఇప్పుడు ఉందా? ఇంకో 9 నెల‌లు పైమాటే. సాధార‌ణంగా సంక్రాంతి సినిమాలంటే.. అక్టోబ‌రు, న‌వంబ‌రులో డిసైడ్ అవుతాయి. ఇంత త్వ‌ర‌గా సంక్రాంతి సీజ‌న్‌పై క‌ర్చీప్ వేశారంటే.. మ‌హేష్‌, ప‌వ‌న్ సినిమాల ప్లానింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవొచ్చు. మ‌హేష్ స‌ర్కారు వారి పాట‌, ప‌వ‌న్ వీర‌మ‌ల్లు (టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు) ఒకే సీజ‌న్‌లో రావ‌డం ఆస‌క్తి క‌ర‌మే. ఇద్ద‌రి మ‌ధ్యా పోటీ నువ్వా? నేనా? అన్న‌ట్టు సాగుతుంది.కాక‌పోతే.. మిగిలిన సినిమాల‌కు ఇప్పుడు భ‌యం ప‌ట్టుకుంటుంది. సంక్రాంతికి రావాల‌నుకున్న కొన్ని సినిమాలు.. ఇప్పుడు వెనక్కి త‌గ్గే అవ‌కాశం ఉంది. ఈ సంక్రాంతికి 4 సినిమాలొచ్చాయి. వ‌చ్చే సంక్రాంతికి ఈ రెండు సినిమాలే విడుద‌ల కావొచ్చు. ఎందుకంటే.. ఇద్ద‌రు పెద్ద స్టార్స్ తో పోటీ ప‌డాల‌ని ఎవ‌రు మాత్రం అనుకుంటారు?

మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` పూర్తి క‌మ‌ర్షియ‌ల్ సినిమా. `గీత గోవిందం`లాంటి హిట్ ఇచ్చిన ప‌ర‌శురామ్ చేస్తున్న సినిమా ఇది. ఈ కాంబో పై బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి. పైగా మ‌హేష్ కి సంక్రాంతి క‌లిసొచ్చిన సీజ‌న్‌. ద‌స‌రాకి ఈ సినిమా విడుద‌ల చేద్దామ‌నున్నార్ట‌. అయితే మ‌హేష్ మాత్రం ప‌ట్టుబ‌ట్టి.. సంక్రాంతి సీజ‌న్ కి తీసుకొస్తున్నాడు. ఇక ప‌వ‌న్ సినిమా. దాని గురించి చెప్పేదేముంది? ప‌వ‌న్ నుంచి వ‌చ్చే ఫ్లాప్ సినిమా అయినా, రికార్డు స్థాయిలో ప్రారంభ వ‌సూళ్లు ద‌క్కించుకుంటుంటుంది. ప‌వ‌న్‌కి ఉన్న స్టామినా అది. అలాంటిది సంక్రాంతి సీజ‌న్‌లో ప‌వ‌న్ సినిమా వ‌స్తే..ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. సాధార‌ణంగా క్రిష్ సూప‌ర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తాడు. అలాంటిది ఈ సినిమాకి ఇంత టైమ్ తీసుకుంటున్నాడంటే… ఫోక‌స్ ఏ రేంజులో పెట్టాడో అర్థం చేసుకోవొచ్చు. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డం, క్రిష్ సినిమాల‌న్నీ క‌థా ప‌రంగా బ‌లంగా ఉండ‌డం.. ప‌వ‌న్ సినిమాకి క‌లిసొచ్చే విష‌యాలు. సో.. అటు ప‌వ‌న్, ఇటు మ‌హేష్ ల‌తో 2022 సంక్రాంతి ఓ రేంజ్ లో ఉండ‌బోతోంది. ఇవి రెండూ హిట్ అయితే.. 2022కి ఓ బంప‌ర్ బూస్ట‌ప్ వ‌చ్చేస్తుంది. వీటితో పోటీ ప‌డే సినిమాలున్నాయా? ఉంటే అవేంటి? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారిని ఒక్క సారీ దర్శించుకోని వైసీపీ అభ్యర్థి..!

తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై భారతీయ జనతా పార్టీ నేతలు కొత్త కొత్త విషయాలు ప్రసారం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి ఇంత వరకూ ఒక్క సారంటే ఒక్క సారి కూడా తిరుమల...

కోల్‌కతా ఓడిపోవడానికే ఆడినట్లుందే..!?

ఎవరైనా మ్యాచ్‌లు ఎందుకు ఆడతారు..? గెలవడానికే ఆడతారు. కానీ ఓడిపోవడానికే ఆడితే ఎలా ఉంటుంది..?. నిజంగా ఓడిపోవడానికి ఎవరూ ఆడరు..కానీ మంగళవారం నాటి ముంబై, కోల్‌కతా మ్యాచ్ చూస్తే రెండు జట్లు ఓడిపోవడానికి...

ఆ ప్రాజెక్ట్ చూస్తామంటే కుదరదంటోన్న ఏపీ..!

ఓ ప్రాజెక్ట్‌ను చూడటానికి వస్తామని కృష్ణాబోర్డు అంటోంది. చూసేందుకు కూడా ఒప్పుకోబోమని.. ఏపీ సర్కార్ తేల్చి చెబుతోంది. కృష్ణా బోర్డు మాత్రం.. అదే పనిగా తాము వస్తున్నామని తేదీ ఖరారు చేసి ఏపీ...

ఏపీలోనే ధరలెక్కువ..! ఎందుకని..?

సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి..? పట్టణాల్లో .. నగరాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న సాధారణ రేట్లే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. నిత్యావసర...

HOT NEWS

[X] Close
[X] Close