కల్కి దగ్గర రూ. 30 కోట్లు వసూలు చేసిన నేతలెవరు..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలకూ ఏదీ కలసి వస్తున్నట్లుగా లేదు. కొత్తగా ప్రస్తుతం బీజేపీలో చక్రం తిప్పుతున్న ఇద్దరు నేతలు ఓ భారీస్కాంలో ఇరుక్కున్నట్లుగా తెలుస్తోంది. రాయలసీమలోని ఓ ప్రముఖ ఆశ్రమంలో జరిగిన ఐటీ, ఈడీ దాడుల కేసుల నుంచి బయట పడేస్తామంటూ ఇద్దరు రూ. ముఫ్పై కోట్లను వసూలు చేసినట్లుగా కేంద్ర నిఘా సంస్థలు గుర్తించి కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక కూడా కథనం ప్రచురించింది. మొత్తంగా ఎక్కడెక్కడ ఎంత ఎంత వసూలు చేశారు.. ఏ బ్యాంక్ నుంచి చేశారు.. ఎలా తరలించారు అన్న అంశాలపై కూడా పూర్తి వివరాలను కేంద్ర నిఘా సంస్థ సేకరించి … కేసు నమోదుకు సిద్ధమయిందని చెబుతున్నారు.

గత ఏడాది చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఉన్న కల్కి భగవాన్‌ ఆశ్రమంలోసోదాలు జరిగాయి. వందల కోట్ల అక్రమ లావాదేవీలు పెద్ద ఎత్తున నగదును స్వాధీనంచేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. తమిళనాడులోని ఆ ఆశ్రమానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. కళ్లు తిరిగేంతటి నగదు.. ఆస్తులు… అక్రమ లావాదేవీల్ని గుర్తించినట్లుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు వ్యవహారం సద్దుమణిగింది. ఇంత కంటే పెద్ద ఆశ్రమాలపై గత ఏడాది దాడులు జరగలేదు. బహుశా.. బీజేపీ నేతలు ఇద్దరు ఈ ఆశ్రమంలో జరిగిన సోదాలు కేసుల నుంచి బయటపడేయడానికి బీజేపీ నేతలు డబ్బులు వసూలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏపీ బీజేపీ నేతలు .. చాలా మంది దందాలకు అలవాటు పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఓ నామినేటెడ్ పోస్టు పొందిన వ్యక్తి… తెలుగు వ్యక్తినేనని చెప్పుకుని చిన్నప్పుడే ఢిల్లీలో స్థిరపడిపోయిన మరో నేత కలిసి.. ఏపీలో డబ్బుల సాగు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా తమ సొంత ప్రభుత్వానికే వారు దొరికిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో నిజానిజాలు బయటకు వస్తే.. వారి రాజకీయ భవిష్యత్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది. అది బీజేపీకి కూడా ఇబ్బందికరం కాబట్టి… ఎలా డీల్ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close