వంశీ తనపై నమోదైన కేసుల్లో బెయిల్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది. మరో వైపు గన్నవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన దాడి కేసులో బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి.రేపోమాపో తీర్పు వస్తుంది. ఆ తీర్పు ఏదో వస్తే ప్రశాంతంగా ఇంటికి వెళదామని.. వల్లభనేని వంశీ అనుకుంటున్నారు. కానీ పోలీసులు అలాంటి ప్రశాంతత ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆయన కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు.
భూకబ్జా చేసులో ఆయనను అరెస్టు చూపించేందుకు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతి ఇస్తుంది కాబట్టి ఆయన టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ వచ్చినా విడుదలయ్యే అవకాశం ఉండదు. భూకబ్జా కేసులోనూ మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి. ఇప్పటికి అరెస్టు అయి మాూడు నెలలు అయింది. ఇప్పటికీ వంశీ తనకు అనారోగ్యమని చెప్పి బెయిల్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
కోర్టుకు హాజరు పరిచినప్పుడు మీడియా ముందు కుంటుకుంటూ నడవడం.. దగ్గడం , తుమ్మడం వంటివి చేస్తున్నారు. శ్వాస తీసుకోవడం సమస్యగా మారుతోందని కోర్టుకు చెప్పారు. ఎలాగోలా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి అయినా బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఆయన కోసం వైపు వైసీపీ నేతలు పెద్దగా న్యాయసాయం చేయకపోవడం..పార్టీ పెద్దగా పట్టించుకోకపోవడంతో వంశీ సతీమణి కూడా లాయర్లతో స్వయంగా మాట్లాడుకుని…న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది.