క‌మ‌ల్ సినిమాలో మ‌రో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌

క‌మ‌ల్ హాస‌న్ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు `విక్ర‌మ్‌`పైనే ఉన్నాయి. ఖైది, మాస్ట‌ర్ సినిమాల‌తో ఆక‌ట్టుకున్న లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్‌సేతుపతి, ఫ‌హ‌ద్ ఫాజిల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌మ‌ల్, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్ ముగ్గురూ జాతీయ స్థాయి న‌టులే. న‌ట‌న‌కు ఓ కొత్త అర్థాన్నిచెప్పారు ఈ ముగ్గురూ. ఈ క‌ల‌యిక క‌చ్చితంగా అబ్బుర‌ప‌రిచేదే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ చేరిన‌ట్టు తెలుస్తోంది. త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అదే నిజ‌మైతే.. `విక్ర‌మ్‌` క్రేజ్ మ‌రింత పెరిగిన‌ట్టే. క‌మ‌ల్ తో క‌లిసి న‌టించాల‌న్న‌ది సూర్య డ్రీమ్‌. ఈ విష‌యం సూర్య చాలాసాన్లు చెప్పాడు. అది ఈ సినిమాతో నిజ‌మ‌వ్వ‌బోతోంది. ఈ సినిమాలో సూర్య క‌నిపించేది కాసేపే అయినా, ఆ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండ‌బోతోంద‌ని టాక్‌. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి మొద‌టి పాట బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనిరుథ్ స్వ‌ర ప‌రిచిన ఆ ఆ గీతాన్ని క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా రాసి, పాడ‌డం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాలికో న్యాయం .. జగన్‌కో న్యాయమా ?

గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులు, జనార్దన్ రెడ్డి తీరు , విచారణ ఆలస్యం అవుతున్న వైనం ఇలా అన్ని విషయాల్లోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణను ఫాలో అవుతున్న వారికి...

ఇక టీఆర్ఎస్ పార్టీ లేనట్లేనా !?

కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ కోసమే ఆ పార్టీపెట్టారు. ఇప్పుడు భారతీయ సెంటిమెంట్‌తో భారతీయ రాష్ట్ర సమితి...

ఫ్యాక్ట్ చెక్ ఏపీ.. నిజాలు చెప్పలేక తంటాలు !

ఏపీ పోలీసులు ఫ్యాక్ట్ చెక్ చేస్తామంటూ ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెక్ ఏపీ అంటూ కొత్త విభాగాన్ని చాలా కాలం కిందట ప్రారంభించారు. ఇందులో సామాన్యులు తప్పుడు సమాచారం వల్ల నష్టపోయే...

కొత్త పార్టీ..కొత్త విమానం.. కొత్త హుషారు.. కేసీఆర్ స్టైలే వేరు !

కేసీఆర్ మౌనం వెనుక ఓ సునామీ ఉంటుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత కసరత్తు కోసం ఆయన కొంత కాలం మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సునామీలా విరుచుకుపడనున్నారు. దసరా రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close