మీడియా వాచ్: తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త ఛానల్ ?

తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ ఛానల్స్ కి కొదవలేదు. రేటింగ్స్ మాట పక్కన పెడితే చిన్నాపెద్దా కలిపి పదుల సంఖ్యలో ఛానల్స్ రన్ అవుతున్నాయి. ఇప్పుడీ ఛానల్స్ జాబితాలో మరో కొత్త ఛానల్ చేరబోతుంది. ఈ కొత్త ఛానల్ వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విజయవాడ కేంద్రంగా AP 24X7 అనే చానల్ ప్రారంభమయింది. మా టీవీ మాజీ అధినేత మురళీకృష్ణంరాజు ఈ చానల్‌కు చైర్మన్. మరికొంత మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభమైన ఈ చానల్ మొదట్లో బాగానే నడిచింది. తర్వాత బోర్డ్ సభ్యుల మధ్య అంతర్గత కుమ్ములాటలు షురూ అయ్యాయి. దీంతో పాటు ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరు కూడా నడిచింది. దీంతో ఛానల్ సంక్షోభంలో పడింది. ఇవన్నీ చూసి విసిగిపోయిన మురళీకృష్ణంరాజు.. ‘తను భాద్యతల నుండి తప్పుకుంటున్నా’ అంటూ చైర్మనే ఏకంగా లేఖ రాయడం అప్పట్లో మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది .

ఈ పరిణామాల మధ్యనే ఛానల్ కి సీఈవో గా పని చేసిన జర్నలిస్ట్ వెంకట కృష్ణ కొన్ని ఆరోపణల కారణంగా రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు సీఈవో లేకుండానే నడిచిన ఛానల్.. ఒక దశలో క్లోజ్ చేసేయాలని భావించి.. కంపెనీలో అరవై శాతం వాటా చైర్మన్ కి అమ్మేయాలని మిగతా బోర్డ్ సభ్యులు నిర్ణయానికి వచ్చారు. ఈ దశలో ఛానల్ ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంగా కొన్నాళ్ళ క్రితమే సుధాకర్ అడపా ని ఆపద్భాందవుడిగా తీసుకొచ్చారు. చైర్మన్ మురళీకృష్ణంరాజు. సుధాకర్ ని ఛానల్ కి సీఈవో గా నియమించారు. సుధాకర్ ది బిజినెస్ నేపధ్యం, ఐఐఎం గ్రాడ్యుయేట్, పలు కంపెనీలకు సీఈవోగా వ్యవహరించారు. అంతేకాదు.. అధికార పార్టీ వైసీపీతో సుధాకర్ కి సన్నిహిత సంబంధాలు కూడా వున్నాయి. నలబై శాతం వాటా ఇస్తామనే అంగీకారంతో సుధాకర్ ని సీఈవోగా తీసుకోచ్చారట.

బేసిగ్గా ఒక ఛానల్ నిలబడాలంటే ఏదో పక్షం అండ తప్పనిసరైన రోజులివి. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తి సిఈవో గా రావడంతో AP 24X7కి మంచి రోజులు వచ్చాయనే భావన మీడియా వర్గాల్లో వచ్చింది. కానీ ఇంతలోనే మళ్ళీ బోర్డ్ సభ్యుల అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి. బోర్డు సభ్యుల్లో ఓ కీలక వ్యక్తి వాటా విషయంలో చైర్మన్ కి వ్యతిరేకంగా పావులు కదిపి.. మిగతా బోర్డ్ సభ్యులతో కుమ్మక్కయ్యారట. తనకున్న పలుకుబడితో చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న జీతాలను ఇప్పించి, ఛానల్ ని ఒక మార్గంలో పెట్టాలనే ఆలోచనలో వున్న కొత్త సీఈవో సుధాకర్ కి ఛానల్ లో మళ్ళీ మొదలైన ఈ కుమ్ములాటలు రుచించలేదు. దీంతో ఆయన మర్యాదగానే తప్పుకోవాలనే ఆలోచన వున్నారని మీడియా సర్కిల్స్ లో వినిపిస్తుంది.

అసలు సంగతి ఏమిటంటే స్వతహాగా బిజినెస్ మ్యానేజ్మెంట్ నేపధ్యం వున్న సుధాకర్.. ఈ రెండు నెలల కాలంలో ఛానల్ నిర్వాహణపై ఓ అవగానకి వచ్చారట. పాత ఛానల్ ని నడపడం కంటే కొత్త ఛానల్ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసికెళ్ళటం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎలాగూ అధికార పార్టీతో సత్సంబంధాలు వున్నాయి. ఇప్పటికే ఆయన కొందరు జర్నలిస్టులతో టచ్ లో వున్నారట. టెక్నికల్ టీం కూడా ఏర్పాటు అయ్యిందట. ఇప్పటికే పేరున్న టీవీల్లో పని చేసిన కొందరు ఎలక్ట్రానిక్ మీడియా సెలబ్రేటీలు కూడా సుధాకర్ తో టచ్ లో వున్నారని తెలుస్తుంది. AP 24X7కి గుడ్ బై చెప్పి .. అతి త్వరలోనే కొత్త ఛానల్ ప్రకటన చేసే అవకాశం వుందని మీడియా సర్కిల్స్ టాక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close