ఆ రెండు సినిమాల్లోనూ పొలిటిక‌ల్ ‘టచ్‌’

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేతిలో సినిమాలే సినిమాలు. వ‌కీల్ సాబ్ పూర్త‌వ్వ‌గానే, క్రిష్ సినిమా మొద‌లైపోతుంది. ఆ త‌ర‌వాత‌.. హ‌రీష్ శంక‌ర్, సురేంద‌ర్ రెడ్డి లైన్‌లో ఉన్నారు. ‘అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌’ రీమేక్ పైనా ప‌వ‌న్ దృష్టి ప‌డింది. హ‌రీష్ శంక‌ర్ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ నిన్న‌నే విడుద‌లైంది. ఆ పోస్ట‌ర్ లో క‌థ థీమ్‌ని చూచాయిగా ప‌రిచ‌యం చేశాడు హ‌రీష్‌. సర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, నేతాజీ ఫొటోల్ని చూస్తుంటే.. ఈ సినిమాలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉండ‌బోతోంద‌న్న అనుమానాలు క‌లుగుతున్నాయి. `యువ‌త రాజ‌కీయాలు` అనే విష‌యంపై.. రాసుకున్న క‌థ అని తెలుస్తోంది.

మ‌రోవైపు… సురేంద‌ర్‌రెడ్డి క‌థ‌లోనూ.. పొలిటిక‌ల్ డ్రామా ఉండ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే వ‌క్కంతం వంశీ పూర్తి స్థాయిలో క‌థ సిద్ధం చేశాడ‌ని స‌మాచారం. దానికి కాస్త ఫినిషింగ్ ట‌చ్ ఇస్తే స‌రిపోతుంది. చేతిలో ఉన్న సినిమాల్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి 2024 ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధం కావాల్న‌న‌ది ప‌వ‌న్ ఆలోచ‌న‌. అందులో భాగంగా హ‌రీష్‌, సురేంద‌ర్ రెడ్డి సినిమాలు పొలిటిక‌ల్ గానూ త‌న‌కు మైలేజీ ఇవ్వాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నాడు. మ‌రి ఈ క‌థ‌లో.. పొలిటిక‌ల్ డ్రామా ఎంతుందో? దాని వ‌ల్ల ప‌వ‌న్‌కి ఎంత మైలేజీ రానుందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close