గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా? అనే అనుమానాలు రేకెత్తాయి. అనుష్క కావాల‌ని సినిమాలు త‌గ్గించుకుంటోంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అనుష్క కూడా ఇప్పుడు అదే నిజం అంటోంది. “అవును.. నాకు గ్యాప్ రాలేదు. తీసుకున్నా. బాహుబ‌లికి ముందు నేనెప్పుడూ విరామం తీసుకోలేదు. అందుకే కావాల‌ని సినిమాలు త‌గ్గించుకున్నా. ఇప్పుడు రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నా. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో చెబుతా” అంటోంది అనుష్క‌.

తాను న‌టించిన ‘నిశ్శ‌బ్దం’ ఓటీటీ వేదిక ద్వారా అక్టోబ‌రు 2న విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపై, త‌న పాత్ర‌పై చాలా న‌మ్మ‌కాలు పెట్టుకుంది స్వీటీ. “ఈసినిమాలో నా పాత్ర పేరు సాక్షి. నాకు మాట‌లుండ‌వు. వినిపించ‌దు కూడా. మూగ భాష‌లోనే సంకేతాలు ఇవ్వాల్సివ‌చ్చింది. అందుకోసం అమెరికాలో రెండు నెల‌ల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నా. ఆ శిక్ష‌ణ నాకెంతో ఉప‌యోగ‌ప‌డింది. సినిమా అంతా నా పాత్ర చుట్టూనే తిర‌గ‌దు. కొన్ని కీల‌క‌మైన పాత్ర‌ల్లో నాదొక‌టి” అంది. ఓటీటీలో ఈ సినిమా విడుద‌ల కావ‌డంపై స్పందిస్తూ.. “ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఓటీటీ లో విడుద‌ల చేయ‌డ‌మే మంచిది. నాకూ ఓటీటీ కొత్తే. సినిమా అంటే థియేట‌ర్ లోనే చూడాలి అనుకుంటాను. నాకూ అదే ఇష్టం. కానీ ప్ర‌పంచం మారుతోంది. ప్రేక్ష‌కులు ఓటీటీకి అల‌వాటు ప‌డుతున్నారు. త్వ‌ర‌లో పాన్ ఇండియా సినిమాలు సైతం ఓటీటీలో విడుద‌ల అవుతాయి. అంత‌గా ఓటీటీలు ప్ర‌భావం చూపిస్తాయి” అని చెప్పుకొచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close