సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట సోనూసూద్‌కి ఇవ్వ‌బోతోంది. లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు సోనూ చేసిన స‌హాయానికి గానూ.. ఈ గుర్తింపు ద‌క్కింది.

వ‌ల‌స కార్మికుల‌కు సోనూ ఇచ్చిన చేయూత అంతా ఇంతా కాదు. త‌న స్వంత ఖర్చుల‌తో వ‌ల‌స కార్మికుల్ని సొంత గూటికి చేర్పించాడు. ఆఖ‌రి వ‌ల‌స కార్మికుడు త‌న గూటికి చేరేంత వ‌ర‌కూ శ్ర‌మిస్తూనే ఉంటాన‌ని ప్ర‌క‌టించాడు. అనుకున్న విధంగానే చేశాడు. సోష‌ల్ మీడియా ద్వారా త‌న వ‌ర‌కూ వ‌చ్చిన స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాడు. చాలామందికి అండ‌గా నిలిచాడు. దాంతో.. సోనూ కాస్త రియ‌ల్ హీరో అయిపోయాడు. అందుకే.. ఐరాస గుర్తింపు సంపాదించాడు. ప్ర‌జ‌ల‌కు త‌న చేత‌నైనంత స‌హాయం చేశాన‌ని, తోటి వారిని ఆదుకోవ‌డం మ‌నిషిగా త‌న బాధ్య‌త అనుకున్నాన‌ని, అందుకే ఈ పుర‌స్కారం వ‌చ్చింద‌ని త‌న సంతోషాన్ని పంచుకున్నాడు సోనూ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌ర్కారు వారి పాట అప్ డేట్: మ‌హేష్ ముందే వెళ్లిపోతున్నాడు

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా `సర్కారువారి పాట‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 4 నుంచి అమెరికాలో షూటింగ్ ప్రారంభం కానుంది. వీసా వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌స్తున్నాయి. అయితే చిత్ర‌బృందం కంటే ముందే.. మ‌హేష్...

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

జగన‌ చల్లని చూపు కోరుకుంటున్న సీపీఎం..!

ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుల పయనం.. భిన్న కోణాల్లో సాగుతోంది. సీపీఐ యాంటీ జగన్ నినాదంతో దూసుకెళ్తుండగా.. సీపీఎం మాత్రం వైసీపీ నీడలో సేదదీరుతోంది. జగన్ నిర్ణయాల్ని సమర్థిస్తోంది. ఆ పార్టీకి వైసీపీ ఎక్కడా కనీస...

HOT NEWS

[X] Close
[X] Close