నాగార్జున తన కెరీర్లో కీలకమైన మైలురాయికి చేరువయ్యారు. ఆయన వందో చిత్రం పట్టాలెక్కించారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్కి తన వందో చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతని ఇచ్చారు. ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్ర చేయనున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాలోనూ జంటగా సందడి చేశారు. ఈ జోడీకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ అనుష్క పేరుని పరిశీలిస్తున్నారు. అనుష్కని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నాగర్జునే. సూపర్ లో ఈ జోడి అలరించింది. ఆ తర్వాత డమరుకం, రగడ చిత్రాలు కలసి చేశారు. నాగ్ ఊపిరి, సోగ్గాడే సినిమాల్లో అనుష్క గెస్ట్ రోల్స్ కూడా చేశారు. ఇప్పుడు నాగ్ వందో సినిమా కోసం మళ్ళీ అనుష్క ఎంపిక చేసే ఆలోచనలో వుంది టీం. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్. ఒక హీరోయిన్ లేడి సిఎంగా కనిపిస్తారని టాక్.