ప్ర‌భాస్‌, రానా… ఇద్ద‌రిలో అనుష్క ఓటు ఎవ‌రికి?

క‌థానాయిక‌ల‌కు చిత్ర విచిత్ర‌మైన ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతుంటాయి. మీరు ప‌నిచేసిన అంద‌రు హీరోల్లో ఎవ‌రు బెస్ట్‌..? లాంటి ప్రశ్న‌ల‌న్న‌మాట‌. వాటికి ఎలాంటి స‌మాధానం చెప్పాలో కూడా నాయిక‌ల‌కు తెలుసు. క‌ర్రా విర‌క్కుండా – పామూ చావ‌కుండా తెలివిగా స‌మాధానం చెప్పేసి త‌ప్పించుకొంటారు. అయితే అనుష్క మాత్రం ఇలాంటి తెలివితేట‌లేం ఉప‌యోగించ‌కుండా చాక‌చ‌క్యంగా స‌మాధానం చెప్పేసింది. అనుష్క తాజా చిత్రం ‘బాహుబ‌లి 2’. ఇందులో ప్ర‌భాస్‌, రానాల‌తో క‌ల‌సి న‌టించింది. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు అంద‌గాడు?? అనే ప్ర‌శ్న అనుష్కకి ఎదురైంది. దానికి స్వీటీ ఏం త‌డుముకోలేదు. ‘ప్ర‌భాస్’ అని ఒక్క మాట‌లో చెప్పేసింది. దానికి కార‌ణం కూడా సెల‌విచ్చింది. రానా త‌న‌కు సోద‌ర స‌మానుడ‌ని, తాను కూడా త‌న‌ని సిస్ట‌ర్ అని పిలుస్తాడ‌ని చెప్పుకొచ్చింది. ఇక మిగిలింది.. ప్ర‌భాస్. త‌నో గొప్ప కోస్టార్ అని… చాలా ఫ్లెండ్లీగా ఉంటాడ‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చింది. ప్ర‌భాస్‌తో క‌ల‌సి ఎన్నిసార్లు ప‌నిచేయ‌మ‌న్నా.. అభ్యంత‌రం చెప్ప‌న‌ని ప్ర‌భాస్‌తో మ‌రోసారి ప‌నిచేయాల‌ని వుంద‌న్న మ‌న‌సులో మాట మ‌రో రూపంలో బ‌య‌ట‌పెట్టింది. సో… అందం విష‌యంలో అనుష్క ఓటు మాత్రం ప్ర‌భాస్ కే అన్న‌మాట‌.

అనుష్క – ప్ర‌భాస్ మ‌ధ్య స‌మ్ థింగ్ స‌మ్ థింగ్ న‌డుస్తోంద‌ని ఎప్ప‌టి నుంచో గాసిప్ రాయుళ్లు చెవులు కొరుక్కొంటున్నారు. తాజాగా అనుష్క చేసిన వ్యాఖ్య‌ల‌తో వాళ్ల‌కు బోల్డంత ప‌ని ప‌డే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.