స్వీటీ మ‌ళ్లీ రేసులోకి వ‌చ్చిన‌ట్టేనా?

దాదాపు ప‌దిహేనేళ్ల జ‌ర్నీ అనుష్క‌ది. ఈ సుదీర్ఘ‌మైన ప్ర‌యాణంలో ఎన్నో సూప‌ర్ హిట్లు కొట్టింది స్వీటీ. లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌కు కేరాఫ్ గా నిలిచింది. ఎవ‌రికీ సాధ్యం కాని స్టార్ డ‌మ్ సంపాదించుకొంది. అయితే.. బాహుబ‌లి త‌ర‌వాత అనుష్క ప్ర‌యాణం ఏమాత్రం ఆస‌క్తిక‌క‌రంగా అనిపించ‌లేదు. అంత పెద్ద విజ‌యాన్ని అనుష్క క్యాష్ చేసుకోలేక‌పోయింది. దాంతో పాటుగా, బాగా ఒళ్లు చేసేయ‌డంతో, సినిమాల‌కు దూర‌మైంది, ఇక అనుష్క కెరీర్ ముగిసిన‌ట్టే అనుకొంటున్న ద‌శ‌లో `మిస్ శెట్టి, మిస్ట‌ర్ పొలిశెట్టి`తో ఓ ఊహించ‌ని హిట్టు త‌న ఖాతాలో వేసుకొంది. నిజానికి ఈ సినిమాపై ఎవ‌రికీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు. అనుష్క కూడా ప్ర‌మోష‌న్ల‌కు రాలేదు. ద‌ర్శ‌కుడు మ‌హేష్‌పై ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. యూవీ కూడా ఈ సినిమాని లైట్ తీసుకొంది. కానీ… అనుహ్యాంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి న‌చ్చ‌డంతో మంచి విజ‌యాన్ని నమోదు చేసుకొంది. వెండి తెర‌పై స్వీటీ స్క్రీన్‌ప్రెజెన్స్ కూడా ఆక‌ట్టుకొంది. అనుష్క మ‌రింత కాలం సినిమాలు చేయొచ్చ‌న్న భ‌రోసా క‌లిగించింది. తాజాగా చిరంజీవి సినిమాలో అనుష్కకు ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సివుంది. చిరు,వెంకీ, బాల‌య్య‌, నాగ్ లాంటి సీరియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల స‌మ‌స్య ఎదుర‌వుతోంది. అనుష్క కాస్త స్లిమ్ గా మారి, న‌ట‌నపై ఆస‌క్తి చూపిస్తే… త‌ప్ప‌కుండా హీరోయిన్ల కొర‌త కొంత వ‌ర‌కూ తీర్చిన‌ట్ట‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’*అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను *వీకెండ్...

టీడీపీ, జనసేన క్యాడర్ సమన్వయ బాధ్యతలు తీసుకున్న నాగబాబు

టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఓట్ల బదిలీ సాఫీగా జరిగేందుకు..క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు తీసుకున్నారు....

లండన్‌లో జగన్ రెడ్డి ఫ్యామిలీకీ ఏపీ ప్రజల ఖర్చుతోనే సెక్యూరిటీ

ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన...

లింగుస్వామికి ఓ హీరో కావాలి

‘పందెంకోడి’, ‘ఆవారా’ వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన దర్శకుడు లింగుస్వామి. ఇటీవల రామ్‌తో ‘ది వారియర్‌’ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైయింది. ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు హీరోతోనే సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close