స్వీటీ అనుష్క కెరీర్ గాసిప్పులకు అతీతం కాదు. అనుష్కపైనా బోల్డన్నిసార్లు రూమర్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా పెళ్లి విషయంలో స్వీటీ చాలాసార్లు వార్తలకెక్కింది. అనుష్కకి ఆల్రెడీ పెళ్లయిపోయిందని, అయితే ఆ విషయాన్ని రహస్యంగా దాచిపెట్టిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఓ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోనుందని, ఇద్దరి నిశ్చితార్థం తిరుపతిలో జరిగిపోయిందని గుసగుసలాడుకొన్నారు. ఇప్పుడు అలాంటి మరో రూమరే.. మరోటి బయటకు వచ్చింది. అనుష్క పెళ్లి ఖాయమైందని, ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ని పెళ్లాడబోతోందని రూమర్లు వినిపించాయి. వీటిపై అనుష్క సీరియస్ అవుతోందట. తన పెళ్లి మీడియాకు జోక్ అయిపోయిందని సన్నిహితుల దగ్గర వాపోతోందట. వరుస సినిమాలతో, బిజీ షెడ్యూల్స్‌తో సతమతమవుతోంటే ఈ పెళ్లిగోలేంటి? అంటూ తెగ ఇదైపోతోందని టాక్.
”గాసిప్పులపై నాకు కోపం లేదు. బాధ మాత్రమే. రాసేవాళ్లకు ఫ్యామిలీ లేదా? వాళ్లకూ కుటుంబాలూ, వాళ్లింట్లోనూ ఆడ పిల్లలూ ఉంటారు కదా” అని వాపోతోంది స్వీటీ. అనుష్క బాధ కూడా అర్థం చేసుకొనేదే. నిజంగానే స్వీటీ తీరకలేని షెడ్యూల్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. తన కెరీర్‌పైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. పెళ్లి కోసం ఇంట్లోవాళ్లు తొందర పెడుతున్నా.. ‘ఇంకాస్త సమయం కావాలి’ అంటోందట. స్వీటీ ఎంత ఆగినా.. 2017లో ఆమె పెళ్లి ఖాయమని అనుష్క సన్నిహితులు చెబుతున్నారు. అనుష్క కూడా అదే మాట చెబుతూ వస్తోంది. పెళ్లి చేసుకోవడం ఖాయం.. అది ఎప్పుడో చెప్పలేను అంటోంది. కానీ ఈలోగా మీడియా తొందర పడి.. ఏవేవో వార్తలు రాస్తోంది. అదే.. అనుష్కనీ, ఆమె కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతోంది. స్వీటీ రియాక్షన్‌తో అయినా… ఈ రూమర్లకు పుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.