ఏపీ బీజేపీ అంటే సోము లేకపోతే విష్ణు..!

తిరుపతిలో బీజేపీకి ఎమైనా కాస్తంత సానుకూల ఫలితం వస్తే.. దానికిసంబంధించి పూర్తి క్రెడిట్ తమకే దక్కేలా సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి.. ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడ చూసినా తామే కనిపించేలాచూసుకున్నారు. ఇతర నేతల వాయిస్ ఎక్కడా వినిపించనీయడం లేదు. తిరుపతిలో బీజేపీ ప్రచార శైలి చూసిన ఇతర పార్టీల నేతలు… సొంత పార్టీలో ఉన్న బీజేపీ నేతలు.. ముక్కున వేలేసుకుంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి హోదాలో ఉన్న సోము వీర్రాజు.. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని తిరుపతిలో మోహరించి.. పక్కా ప్రణాళికతో ప్రచారం చేయాల్సి ఉంది. కానీ సోము వీర్రాజు..బాగా నోరున్న నేతలు ఎక్కడ ప్రచారం చేస్తే.., వారుఎక్కడ హైలెట్ అవుతారని అనుకున్నారో కానీ..చాలా మందిని పక్కన పెట్టేశారు. ఎవరికీ పెద్దగా మాట్లాడే చాన్సివ్వడం లేదు. ఇంటింటి ప్రచారం చేసేందుకు తిప్పుతున్నారు కానీ.. వారి వాయిస్ బయటకు రానీయడం లేదు.

సామాజికవర్గ సమీకరణాల్ని చూసుకుని… కొంత మంది నేతలు అంతో ఇంతో ప్రభావితం చేయగలనేతలు ఉన్నా… వారిని దూరంగానే ఉంచారు. సాదినేని యామిని శర్మ, రావెల కిషోర్ బాబు సహా పలువురు గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చిరపరిచితమైన వాళ్లు ఆ పార్టీలో ఉన్నారు. వారిని ఏ మాత్రం ఉపయోగించుకోవడం లేదు. అలాగే సామాజికవర్గాల ప్రకారం తిరుపతి నియోజకవర్గంలో అంతో ఇంతో ప్రభావం చూపగలవాళ్లు ఉన్నా… లైట్ తీసుకున్నారు. ఎవరికీ పెద్దగా బాధ్యతలు ఇవ్వడం లేదు. ప్రెస్ మీట్లు కూడాఎక్కువగా పెడుతున్నారు కానీ.. ఆ ప్రెస్‌మీట్లలో మాట్లాడేది సోము వీర్రాడు లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి.

జనసేన మద్దతుతో బీజేపీకి గతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయన్న నమ్మకంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఎంత బలం పుంజుకున్నా.. అది తమ కష్టమేనని చెప్పుకునేందుకు సోము, విష్ణువర్ధన్ రెడ్డి ఓ కోటరీలాగా ఏర్పడి… కీలకమైన నేతల్ని దూరం పెడుతున్నారన్న చర్చ వినిపిస్తోంది. అదే సమయంలో వీరిద్దరూ.. ఎన్నికల ఖర్చుల కోసం… పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలపై ఒత్తిడి పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయం హైకమాండ్‌కు కూడా తెలిసిందని.. ఎన్నికల తర్వాత వారి వ్యవహారంపై దృష్టి పెడతారన్న చర్చ కూడా నడుస్తోంది. ఓ వైపు బీజేపీకి మద్దతుగా బలమైన ప్రచారం చేయకపోవడం తోడు.. వారిచేస్తున్న వ్యవహారాలు… వైసీపీకి మేలు కలిగేలా ఉండటం జనసేన వర్గాల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందుకే రాను రాను ఎన్నికల ప్రచారంలో వారి కంట్రిబ్యూషన్ తగ్గిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులు కొట్టారని RRR ఫిర్యాదు, పోలీసుల పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి సర్కార్ అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు మొదలుకొని సామాజిక వర్గ...

ఆహా కోసం రెండు క‌థ‌లు సిద్ధం చేసిన మారుతి

మెగా కుటుంబంతో మారుతికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అల్లు శిరీష్ తో త‌ప్ప‌.. మెగా హీరోలెవ‌రితోనూ సినిమాలు చేయ‌క‌పోయినా మంచి రాపో ఏర్ప‌డింది. అల్లు అర్జున్ కి మారుతి చాలా క్లోజ్‌. అల్లు...

టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ సర్కార్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ రాసిన లేఖపై ఏపీ విద్యా మంత్రి సురేష్ పరోక్షంగా స్పందించారు. పరీక్షలు జరిగితీరుతాయని విద్యార్థులు ప్రిపేర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్...

పవన్ సరే ఆ బాధ్యత అధికార పార్టీకి లేదా..!?

రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది కరెక్ట్ సమయం కాదని .. ముందు కోవిడ్ రోగుల గురించి పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ లేఖపై వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close