వైసీపీకి ఇబ్బందికరంగా “నారాసుర రక్త చరిత్ర”..!

గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు .. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు చాలా ప్రచారాలు చేశారు. అయితే వారెన్ని ఆరోపణలు చేసినా అది రాజకీయమే. కానీ సాక్షి మీడియా మాత్రం మరింత ముందుకెళ్లింది. నారాసుర రక్త చరిత్ర పేరుతో నాలుగు పేజీల కథనాలను రాసింది. అందులో వైఎస్ కుటుంబంలోని ఫ్యాక్షన్ హత్యలన్నీ.. చంద్రబాబే చేయించారని ఆరోపించింది. అంతే కాదు.. చంద్రబాబు చేతిలో వేట కత్తి పెట్టి.. దానికి రక్తపు మరకలు కూడా గ్రాఫిక్స్‌గా స్పెషల్ ఎఫెక్ట్స్ వేసి… ఫోటోలో చూపించారు. అప్పట్లో ఈ కథనాలు సంచలనం సృష్టించాయి. సాక్షికి ఉన్న మీడియా ప్రివిలేజెస్ ని గౌరవించే టీడీపీ.. ఆ కథనాలను ప్రజాస్వామ్యబద్దంగానే ఖండించారు.

కానీ ఇప్పుడు ఆ వ్యవహారాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా బాబాయ్ హత్య కేసును తేల్చకపోవడం.. సీబీఐ విచారణ వద్దని వెనక్కి తగ్గడం… సొంత కుటుంబసభ్యులపైనే.. వివేకా కుమార్తె.. ఆరోపణలు చేయడం వంటి వాటితో.. కేసు సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తోంది. దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నారా లోకేష్.. శ్రీవారి ఆలయంలో ప్రతిజ్ఞ చేయాలని జగన్‌కు సవాల్ చేశారు. నారాసురరక్త చరిత్ర అంటూ .. తన తండ్రిపై నిందలు వేశారని.. అవన్నీ నిజం అని ప్రమాణం చేయాలని… సవాల్ చేశారు. పధ్నాలుగో తేదీన ముహుర్తం పెట్టారు. అదే రోజున జగన్ సభ ఉండటంతో వస్తారని అనుకున్నారు. కానీ జగన్ సభ క్యాన్సిల్అయింది. అయినా లోకేష్ తాను సవాల్ చేసినట్లుగా అలిపిరి చేరుకున్నారు. అక్కడ నారాసుర రక్త చరిత్ర కథనాలను చూపించి… మరోసారి ఘాటు విమర్శలు చేశారు.

వివేకానంద హత్య కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. నిందితులెవరో ఇంత వరకూ కనిపెట్టలేదు. కానీ ఆ హత్య ఎవరు చేశారో… ఆ నోటా.. ఈ నోటా అందరికీ తెలిసిపోయింది. కానీ అధికారికంగా దర్యాప్తు సంస్థలే నిరూపించాల్సి ఉంది. కానీ దర్యాప్తు సంస్థలు … పాల వాళ్లను.. వీధి చివర ఉండే చిల్లర కొట్టు వాళ్లను.. చెప్పుల దుకాణాల వారినిప్రశ్నిస్తూ టైం పాస్ చేస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో… వైఎస్ వివేకా హత్య కేసును మరితంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. గతంలో సాక్షి పత్రిక చేసిన ప్రచారం… ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ కావడం.. వైసీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close