తలచుకుంటే అమరావతిలో నెలలోనే ఫస్ట్ బిల్డింగ్ రెడీ

ఏపీ నూతన రాజధాని అమరావతి నగర శంకుస్థాపన విజయదశమిరోజున పూర్తికాగానే ఇక అందరి చూపు అక్కడి నిర్మాణపనులమీదనే పడుతుంది. ఏ భవన నిర్మాణానికైనా శంకుస్థాపన అయిందంటే చాలు, ఇక పనులు శరవేగంతో జరుగుతాయనే అనుకుంటారు. `ఎంతవరకు వచ్చిందంటూ’- ఇరుగుపొరుగువారు ఆరాతీయడం కూడా మామూలే. అలాంటిది ఒక రాష్ట్రానికి రాజధాని నగర నిర్మాణం పట్ల ప్రజలు ఎంతగా ఆసక్తిచూపుతారో చెప్పనక్కర్లేదు. పైగా ప్రజల భాగస్వామ్యంతో కడుతున్న రాజధాని ఇది. ప్రతి ఊరు నుంచి ఒక కిలోమట్టి, లీటర్ నీళ్లు తీసుకెళ్ళి రాజధాని శంకుస్థాపన సమయంలో అందిచబోతున్నారుకాబట్టి ప్రజలందరిలో కూడా రాజధాని తమదన్న భావన బాగా పెరిగిపోతున్నది. ప్రతి చిన్నవిషయంపై వారు కూడా ఆరాతీస్తుంటారు.

అమరావతి నిర్మాణంలో సాంకేతిక సహాయాన్ని సింగపూర్, జపాన్ దేశాల నుంచి లభించబోతున్నాయని అంటున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవీ లేవనుకుంటే, వెంటనే అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు మొదలుపెడతారనుకుంటే కనీసం మొదటి బిల్డింగ్ (60 అంతస్థుల భవనం) ఎప్పటికి పూర్తిచేయవచ్చన్న విషయంపై ఒక అంచనాకు రావచ్చు. అంతర్జాతీయ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో 30 అంతస్థుల భవనాన్ని ఈమధ్యనే చైనాదేశంలో కేవలం 15 రోజుల వ్యవధిలో పూర్తిచేశారు. అంటే 60 అంతస్థుల భవనాన్ని చైనా సాంకేతిక బృందం నెలలో పూర్తిచేయగలదన్నమాట.

మోదీకి చైనా, బాబుకి సింగపూర్

భారత ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యనే విడివిడిగా చైనా దేశాన్ని సందర్శించారు. మోదీ తన పర్యటనలో ఆక్కడి బహుళ అంతస్థుల భవన నిర్మాణం గురించి ఎంతో ఆసక్తిగా తెలుసుకున్నారు. అదే మోస్తరు నిర్మాణాలు మనదేశంలో కూడా చేపడితే బాగుంటుందని అనుకున్నారు. అందుకే చంద్రబాబు తనను కలసినప్పుడు చైనా తరహా భవన నిర్మాణం గురించి ప్రస్తావించారు. అయితే బాబు మదిలో మాత్రం సింగపూరే ఉంది. మాస్టర్ ప్లాన్ సహా ప్రధాన నిర్మాణాల భాద్యత సింగపూర్ కే అప్పగించవచ్చు. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాల సాంకేతిక ప్రమాణాలతో క్యాపిటల్ సిటీ నిర్మించబోతున్నట్లు పలుసందర్భాల్లో బాబు చెప్పారు. అలాంటప్పుడు చైనాను భాగస్వామ్యం చేస్తారని అనుకోలేము. చైనా తరహాలో ఫాస్ట్ గా రాజధాని భవనాలు నిర్మిస్తారనీ ఎలా అనుకోగలం? ఒక వేళ చైనా టెక్నాలజీని సింగపూర్ నిపుణులు కూడా పాటించేపక్షంలో రాజధానిలోని ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ని కేవలం నెల రోజుల వ్యవధిలోనే పూర్తిచేసే అవకాశం ఉంది. అంటే మొత్తంమీద మనకు అర్థమైంది ఏమంటే, చేతిలో డబ్బులుంటే నాలుగైదు నెలల్లోనే ముఖ్యమైన బహుళ అంతస్థుల భవనాలను ఆక్యుపేషన్ కు సిద్దం చేసుకోవచ్చు.

china 2

చైనాలో 360 గంటల్లో బిల్డింగ్

చైనాలో కేవలం 360 గంటల్లో (15రోజులు) 30 అంతస్థుల హోటల్ నిర్మించారు. స్టీల్ స్ట్రక్చర్స్ ని ఉపయోగిస్తూ చకచకా కట్టేశారు. సిబ్బంది ఎవరి షిప్ట్స్ లో వాళ్లు వచ్చి పనిచేసి వెళ్లిపోయేవారు. ఎవరికీ ఎలాంటి పనిఒత్తిడి లేకుండానే కేవలం 360 గంటల్లో ఒక్క నిమిషం కూడా పనులు ఆగకుండా నిర్మాణపనులు పూర్తిచేశారు. సరే, అంత వేగంగా కట్టేశారుకదా , మరి బిల్డింగ్ ఎలా ఉంటుందని శంకించాల్సిన పనేలేదు. ఇదేమీ నాసిరకం భవనం కానేకాదు. ఉక్కులాంటి భవనం. పెను భూకంపం వచ్చినా చెక్కుచెదరదు. రెక్టర్ స్కేల్ పై 9 తీవ్రతతో భూమి కంపించినా భవనం తట్టుకోగలదు. ఈ విషయం ప్రయోగాత్మకంగా కూడా నిరూపితమైంది. అంతేకాదు, ఇంధనశక్తి ఆదాలో కూడా ఇది ఘనాపాఠి. చక్కటి గాలివెలుతురు ఉండేలా నిర్మించారు. అంతేకాదు, మిగతా వాటితో పోలిస్తే 20రెట్లు ప్రెష్ ఎయిర్ పంపింగ్ అవుతుంటుంది. త్రీస్టేజ్ ఎయిర్ ఫిల్టరేషన్ పద్ధతి ఉంది. అన్ని వసతులతో ఈ భవంతిని గంటగంటకూ పురోభివృద్ధి చూపిస్తూ ఛాలెంజ్ గా నిర్మించారు చైనావాళ్లు.

బాబుకు ఇదో సవాల్

మరి అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, భవన నిర్మాణ బృందాన్ని ఎంపిక చేసుకుంటే కేవలం నెలల వ్యవధిలోనే ఒకటిరెండు బహుళ అంతస్థుల భవనాలు అమరావతిలో కళ్లెదుట నిలుస్తాయి. అదే జరిగితే రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు పట్ల నమ్మకం పెరుగుతుంది. అలాకాకుండా సాగదీసే ధోరణిలో వెళితే మాత్రం బాబుపట్ల ఉన్న విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.

అలాగే శంకుస్థాపన కార్యక్రమం హడావుడి ముగియగానే వెంటనే రహదారుల నిర్మాణ పనులను కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. రోడ్లపై నీరు క్షణాల్లో ఇంకిపోయే ఆధునిక టెక్నాలజీ (మ్యాజిక్ కాంక్రీట్ లాంటివి) ఉపయోగించాలి. ప్రధాన రోడ్ల నిర్మాణం, భవన నిర్మాణం అలాగే విజయవాడ మెట్రో రైల్ పనులు, ఔటర్ రోడ్ పనులు వెంటవెంటనే ప్రారంభించాలి. అప్పుడే రెండుమూడేళ్లలో నూతన రాజధాని ఒక షేప్ కి వస్తుంది. అలా జరగాలంటే ప్రతి ప్రాజెక్ట్ లో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడాల్సిఉంటుంది. ఎక్కడా కుంభకోణాలకు తావివ్వకుండా మనదేశంలో ఇంతటి భారీ ప్రాజెక్ట్ లు పూర్తవుతాయా ? ఇదంతా కేవలం భ్రమేనంటూ కొట్టిపారేసేవారే ఎక్కువ. ఈవాదన తప్పని నిరూపించాల్సిన అతిపెద్ద బాధ్యత హైటెక్ ముఖ్యమంత్రిమీద ఉంది. రాష్ట్ర ప్రజలేకాదు, దేశ ప్రజలంతా ఈ రాజధాని నిర్మాణంపట్ల నిఘానేత్రాలు పెట్టిఉంచుతారన్న విషయాన్ని చంద్రబాబు మరువకూడదు. ఎక్కడ ఏ చిన్నపొరబాటు జరగకుండా విజయవంతంగా రాజధాని నిర్మిస్తే మాత్రం ఆయనపేరు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరులో జగన్ – టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్ క్రిస్టినా !

గుంటూరులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభ పెట్టి పాత క్యాసెట్ ను తిరగేస్తున్న సమయంలో .. గుంటూరు జడ్పీ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా వేమూరులో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటన్న చంద్రబాబు...

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ...

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close