డ్రామాలాడి ఏపీలో అస్థిరత్వానికి కుట్ర చేశారు: చంద్రబాబు

జగన్ పై జరిగిన దాడి అంతా డ్రామానేని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చారు. ఏపీపై ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో… విశాఖ ఎయిర్‌పోర్టు ఘటనతో తేలిపోయిందన్నారు.

దాడి జరిగిందని ఆరోపణలు చేసిన జగన్‌…బాధ్యత లేకుండా హైదరాబాద్‌ వెళ్లిపోవడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. వాళ్లలో వాళ్లు దాడులు చేసుకున్నారు… డ్రామాలు ఆడారన్నారు.

ఇదంతా జరిగిన వెంటనే డీజీపీకి గవర్నర్‌ ఫోన్‌ చేశారు .. అసలు విమానాశ్రయం ఎవరి పరిధిలో ఉంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్‌ పాత్ర ఏమిటి? ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశాను నేను.. ఏమనుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌పై దాడి జరిగిందంటూ పవన్‌ ఖండిస్తారు… కేటీఆర్‌ స్పందిస్తారు… దీంతో అందరూ ఏకమయ్యారని అర్థమవుతోందన్నారు. విభజన కష్టాలతో ఉన్న ఏపీపై అందరూ ఏకమై దాడులు చేస్తున్నారు మీలో మీరు దాడులు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారా?..హైవేలపై ధర్నాలు, నిరసనలు చేస్తారా? అని మండిపడ్డారు. దాడి చేసిన వ్యక్తి జగన్‌ వీరాభిమానినని చెప్పుకున్నాడని ..జగన్‌ను పొగుడుతూ, తనను తిడుతూ లేఖలు రాసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దాడిని టీడీపీకి అంటగడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ బాధ్యత లేకుండా హైదరాబాద్‌ వెళ్లిపోయారని… ఎంతసేపూ ప్రజలను రెచ్చగొట్టాలన్నదే జగన్‌ ఆలోచన్నారు. తుపాను విషయంలోనూ జగన్‌ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాశారని గుర్తు చేశారు. జగన్‌కు తగిలిన గాయం చాలా చిన్నదేనని
విశాఖ వైద్యులు ఇచ్చిన రిపోర్టును చదివి విన్పించారు. అర అంగుళం మేర గాయమైందని…డాక్టర్లు ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా ఉందన్నారు. వీళ్ల బండారం రెండుమూడు గంటల్లోనే బయటపడిందని.. మాకు సభ్యత ఉంది కాబట్టే దాడిని ఖండించామని గుర్తు చేశారు. జగన్‌ విమానంలో వెళ్లడానికి సీఐఎస్ఎఫ్‌ అనుమతించింది చట్టం కొందరికి చుట్టమా? అని ప్రశ్నించారు. గాయంతో ఉన్న వ్యక్తిని విమానం ఎలా ఎక్కించారన్నారు. దాడి నెపంతో రేపు కోర్టుకు హాజరుకాకూడదని… జగన్‌ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అస్థిరత్వం సృష్టించి… అరాచకాలు చేయాలనుకుంటున్నారని విమర్శించారు. తితలీ తుపానుపై స్పందించని కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత… జగన్‌పై దాడి పట్ల ఎందుకు స్పందించారు.. ఏపీ పట్ల ఎందుకు ఇంత కక్ష ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు.

ఏం జరిగినా మేం చూసుకుంటామని కేంద్రం వీరికి భరోసా ఇచ్చింది అందుకే ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారన్నారు. ఇంత దుర్మార్గమైన వ్యక్తులను… ఇంత దుర్మార్గమైన పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. సీబీఐని కేంద్రం ఇష్టానుసారంగా వాడుకుంటోందని .. మీరు దాడులు చేసినా, కుట్రలు చేసినా మేం భయపడబోమన్నారు. ఇలాంటి ఎన్నో సంక్షోభాలు మేం ఎదుర్కొన్నామని కేంద్రంపై చేస్తున్న ప్రతి దాడి ఏపీపై చేస్తున్న దాడేనని చంద్రబాబు తేల్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com