విశాఖలో హాఫ్ సెంటిమీటర్ – హైదరాబాద్‌ లో 9 కుట్లు ..‍! జగన్ గాయం చాలా మిస్టరీ గురూ..!

విశాఖ ఎయిర్ పోర్టులో జరిగినట్లు చెబుతున్న దాడిలో.. జగన్ కు అయిన గాయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దాడి ఘటన జరిగిన వెంటనే.. విమానాశ్రయంలోని డ్యూటీ డాక్టర్ ఆయనకు ప్రాధమిక వైద్యం చేశారు. హాఫ్ సెంటిమీటర్ గాయం మాత్రమే కావడంతో.. గాయం దగ్గర శుభ్రం చేసి…యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇచ్చి పంపేశారు. దానికి కట్టు కూడా అవసరం లేదని తేల్చారు. ఈ మేరకు … నిబంధనల ప్రకారం.. వైద్యం చేసినట్లు.. నివేదిక.. రిపోర్టును.. ఎయిర్‌పోర్టు సిబ్బందికి ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న దాదాపు గంట తర్వాత హైదరాబాద్ ఫ్లైట్ వచ్చింది. జగన్ తన బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి మార్పులు తెచ్చుకోలేదు. ఎప్పటి లాగే అందరికీ నమస్కరిస్తూ… వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై.. ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ప్రయాణానికి అనుమతి ఇచ్చారు.

అయితే.. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి… హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తన ఇంటి సమీపంలో ఉన్న సిటీ న్యూరో హాస్పిటల్ అనే ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్లు కాస్తంత డ్రామా నడిపించారు. అనస్థిషీయా మత్తులో జగన్ ఉన్నట్లు కొన్ని ఫోటోలు చేశారు. తొమ్మిది కుట్లేసినట్లు చెప్పుకొచ్చారు. ఏకంగా ఒకటిన్నర ఇంచ్ లోతులో గాయం అయినట్లు కూడా రిపోర్ట్ విడుదల చేశారు. దీంతో .. జగన్ గాయంపై కొత్త అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు విశాఖలో వైద్యులు ప్రాథమిక వైద్యం చేసి చెప్పింది కరెక్టా..? లేక హైదరాబాద్ జగన్ వైద్యం చేయించుకున్న ఆస్పత్రి కరెక్టా..? .

విశాఖ డాక్టర్లు చెప్పిందే నిజమవుతుంది… ఎందుకంటే.. ఒకటిన్నర ఇంచ్ గాయం అంటే.. రక్తం ధారపాతంగా కారిపోతుంది. వెంటనే… కట్లు వేయాలి. జగన్ అలాంటి కట్లు ఏమీ లేకుండానే హైదరాబాద్ వచ్చారు. మొత్తానికి తనకు ఏదో పెద్ద గాయమే అయిందని… షో చేయడానికి జగన్ అండ్ కో ప్రయత్నించారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close