ఎడిటర్స్ కామెంట్ :  వ్యవస్థలను మించి ఎదిగిన ఆంధ్రా సీఎం ..!  

జగన్మోహన్ రెడ్డి మహా మొండి.. ఏది అనుకుంటే అది చేస్తారు..! .. అన్న ప్రచారం ఇప్పుడు.. కోర్టులను కూడా ధిక్కరించే విధానంలో కూడా చాలా వేగంగా జరిగిపోతోంది. కోర్టులను.. న్యాయవ్యవస్థను కూడా లెక్క చేయకపోవడం… గొప్పగా చెప్పేస్తున్నారు. ప్రజలకు మేలు జరుగుతుందా.. కీడు జరుగుతుందా.. అన్న సంగతి తర్వాత చట్టబద్ధంగా.. న్యాయబద్ధంగా లేని నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రజలకు మేలు చేసేస్తాం అని… రాజ్యాంగం కన్నా.. చట్టాల కన్నా తామే మిన్న అన్నట్లుగా వ్యవహరించడం.. ఖచ్చితంగా దేశ సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమే అవుతుంది. ప్రజలు అధికారం కట్టబెట్టారు.. మేం చేసినా చెల్లుతుందనే పరిస్థితికి అధికారపార్టీలు వస్తే.. ఆ దుష్ఫలితాలు అనుభవించేది వ్యక్తులు కాదు.. దేశమే…!  

రాజ్యాంగ, చట్ట వ్యతిరేకంగా కావాలనే నిర్ణయాలు..! 

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టులతో పోరాడుతున్నట్లుగా చాలా పకడ్బందీగా పిక్చరైజ్ చేస్తున్నారు. ఒకప్పుడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతే.. ఆ నిందను.. సోనియా మీద.. చంద్రబాబు మీద.. రిలయన్స్ మీద.. ఇలా అవసరం వచ్చినప్పుడల్లా…. మార్చి మార్చి వారిపై వేసి.. తనకు కావాల్సిన రాజకీయ లబ్ది పొందారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత మరింత భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనపై ఉన్న సీబీఐ కేసులు కారణం కావొచ్చు.. ఇతర అంశాలు కావొచ్చు కానీ.. ఆయన న్యాయవ్యవస్థపైనే యుద్ధం ప్రకటించారు. చీటికి మాటికి.. ఆయన కోర్టులకు పని పెడుతున్నారు. తన ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం న్యాయస్థానం వద్దకు వెళ్లేలా చేసుకుంటున్నారు. ఆ నిర్ణయానికి తీర్పు ఖచ్చితంగా వ్యతిరేకంగా వచ్చేలా.. నిర్ణయాలు ఉంటున్నాయి. చట్టం పాటించరు.. రాజ్యాంగం నిబంధనలు ఉండవు. ఏ విధంగా చూసినా..  కనీస పరిజ్ఞానం ఉన్న వారు కూడా.. అలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారన్న  డౌట్ వస్తుంది. దాదాపుగా ప్రతీ నిర్ణయం అంతే ఉంది. అన్నింటినీ కోర్టులు కొట్టి వేస్తూంటే… తాను చేయాలనుకున్న పనులన్నింటికీ కోర్టులు అడ్డం పడుతున్నాయన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపేందుకు.. ఆయన టీం.. చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. 

కోర్టులు కొట్టివేసే వ్యూహంతోనే జీవోలు.. ఆదేశాలు..! 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి చట్టం.. రాజ్యాంగంపై కనీస అవగాహన లేదని అనుకోవడానికి లేదు. ఆయన రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయి.. రాజ్యాంగంపై కనీస అవగాహన లేదు అనుకున్నా…   ముఖ్యమంత్రి అంటే. .ఓ వ్యవస్థ. ఆయన ఒక్కరే కాదు. ఓ నిర్ణయం జీవో రూపంలో రావాలంటే..  అధికార వ్యవస్థ పని చేయాలి. అన్ని రకాల నియమ నిబంధనలు పాటించేలా చూసుకుని.. ఆ జీవో బయటకు తీసుకు రావాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోల్లో… ఏ నియమ నిబంధనలు పాటించడం లేదు. సీఎం జగన్‌కు అవగాహన లేకపోతే… సివిల్ సర్వీస్ సాధించి.. దశాబ్దాల తరబడి సర్వీస్ ఉన్న వారికి అవగాహన ఉండదా..?. అలాంటి పరిస్థితికి అవకాశమే లేదు.. అన్నీ తెలిసి.. పూర్తి స్థాయిలో అవగాహనతోనే ఆ జీవోలు.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్టుల వద్దకు వెళ్లేలా చేసుకుంటున్నారు. కోర్టుల్లో వ్యతిరేక నిర్ణయాలు వస్తాయని… అధికారులకు తెలియక కాదు. ఆ నిర్ణయాలు అమల్లోకి వచ్చే అవకాశం లేదని వారికీ తెలుసు. అందుకే.. వీలైనంత నంపాదిగా వ్యవహరిస్తున్నారు. అటు ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించి.. ఎల్వీ సుబ్రహ్మణ్యంలా అవమానానికి గురి కావడం కన్నా… ఇలా కొనసాగితే చాలని అనుకుంటున్నారు. 

న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నించేలా మరో వైపు ప్రచారం..! 

చేయాల్సిందందా చేసేసి.. కోర్టులు తమ నిర్ణయాలను కొట్టి వేస్తున్నాయని.. ప్రజలకు మేలు చేయనీయడం లేదనే వాదనను… ఏపీ అధికార పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే.. ఏపీ సర్కార్ ఇప్పుడు ప్రతిపక్షంపై పోరాడటం లేదు. న్యాయవ్యవస్థపై పోరాడుతోంది. ఇక్కడే చాలా మందికి రాజకీయం తేడా కొడుతోంది. న్యాయవ్యవస్థ తల్చుకుంటే.. జగన్ జైల్లో ఉంటారని.. అయినా ఎందుకిలా చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పయనం చూస్తే.. ఎక్కడా.. అఫెన్సివ్‌గా లేదు. ఎదురుదాడి చేసి.. తన వాదనతో ప్రజలను నమ్మించడం ద్వారా.. ఇతరులు నోరు తెరవకుండా చేయడం ద్వారా ఆయన తన ప్రయోజనాల్ని నెరవేర్చుకుంటున్నారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు వ్యూహం చూస్తే.. సులువుగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెలిస్తే.. వారిపై టీడీపీ ముద్ర వేసి.. ఆత్మరక్షణలోకి నెట్టేందుకు పకడ్బందీ ప్లాన్ అమలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థపైనా అదే విధంగా గెలవాలనుకుంటున్నారన్న అభిప్రాయం ఈ పరిణామాల వల్ల వస్తోంది. 

దీర్ఘకాలిక వ్యూహంతోనే న్యాయవ్యవస్థపై జగన్ పోరాడుతున్నారా..?

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తే.. జగన్మోహన్ రెడ్డికి ఏమి వస్తుంది..?  అని ఆలోచిస్తే.. ఆయనకు జీవితం వస్తుంది. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసులు చాలా తీవ్రమైనవి. సాక్ష్యాలు కళ్ల ఎదురుగా కనిపిస్తున్నాయి. వైఎస్ సీఎం కాక ముందు.. సీఎం అయిన తర్వాత ఐదేళ్లలో పెరిగిన ఆయన ఆస్తుల విలువ… లెక్క తీస్తేనే.. సులువుగా సాక్ష్యాలు బయటకు వస్తాయి. సీబీఐ అదే చేసింది. కొన్నాళ్ల పాటు చురుగ్గా ఉన్న సీబీఐ ఆ తర్వాత.. ఈ కళ్లు తిరిగిపోయే.. మహా సామ్రాజ్యం గురించి లైట్ తీసుకుంటోంది. దానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు. అయితే.. ఇలాంటి నేరాల్లో.. సాంకేతిక అంశాలు చూపించి.. కేసులు కొట్టివేసే పరిస్థితి లేదు. శిక్ష పడాల్సిందే. సాంకేతిక ఆధారాలు పెద్దగా లేని సమయంలోనే అక్రమాస్తుల కేసుల్లో జయలలితకు శిక్ష పడింది. జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటారని ఎవరూ అనుకోరు. బహుశా.. ఆయన కూడా అనుకోకపోవచ్చు. అందుకే… తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని.. అంచనా వేయవచ్చు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేయడం ద్వారా.. రేపు తనకు వ్యతిరేకంగా వచ్చే తీర్పుపైనా ప్రజల్లో సందేహం కలిగించేలా ఆయన తన వ్యహాన్ని అమలు చేస్తున్నారని భావించాలి. తన వ్యూహం అంత కంటే ఎక్కువగా ఫలిస్తే.. శుభవార్త అందుకున్నా ఆశ్చర్యం లేదని ఆయన ప్లాన్. 

వ్యవస్థలు అదుపు చేయలేని సీఎం జగన్..! 

జగన్మోహన్ రెడ్డిని మొండి… జగమొండి.. అని చెబుతారు.. కానీ ఆయనకు ఇప్పుడు రాజకీయాల్లో ఆయనతో పోటీ పడుతున్న వారి ఊహలకు సైతం అందని  రాజకీయం చేయగల మైండ్ సెట్ ఉంది. దానికి ఏ పరిమితులూ లేవు. అలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేయాలన్న ఆలోచన కూడా ఇతరులకు రాదు. కానీ జగన్ చేస్తున్నారు. అది ఏ మలుపులు తిరుగుతుందో చెప్పలేం.. కానీ ఒక్కటి మాత్రం.. జగన్ న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే తన నిర్ణయాలను కొట్టివేసేలా చేసుకుంటున్నారు. ఆ పరిణామాల్ని ప్రజల్లోకి మరో రకంగా పంపుతున్నారు… దానికి ఎంతో ఆలోచించాల్సిన అవసరం లేని ఉదాహరణ.. ఇంగ్లిష్ మీడియం. స్కూళ్లలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండూ ఉంచితే.. విద్యార్థులు ఏ మీడియంలో కావాలంటే దాంట్లో చదువుకుంటారు. అంతటితో సమస్య పరిష్కారమైపోతుంది. కానీ జగన్.. విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. తెలుగును రద్దు చేస్తానంటూ.. కోర్టుల వద్దకెళ్తున్నారు. కోర్టులు కొట్టివేస్తే.. దాన్నో ఉత్పాతంలా ప్రచారం చేస్తున్నారు. అన్నింటిలోనూ ఇంతే. అందుకే జగన్… అలాంటిలాంటి సీఎం కాదు.. వ్యవస్థలు అదుపు చేయలేని సీఎం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవ్వాతాతలకు జగన్ రూ.15,750 బాకీ..! ఆర్ఆర్ఆర్ కొత్త ఫిట్టింగ్..!

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రూటు మార్చారు. ఇప్పటి వరకూ పార్టీ అవకతవకల గురించి మాట్లాడుతూ వచ్చిన ఆయన ఇప్పుడు.. మరింత ముందుకెళ్లారు. వైసీపీ పథకాలు.. హామీలు.. అమల్లోని లోపాలపై గురి పెట్టారు....

ఉరిమి ఉరిమి ప్రైవేట్ ల్యాబ్స్‌పై పడుతున్న తెలంగాణ సర్కార్..!

కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ తప్పు అంతా ప్రైవేటు ల్యాబ్స్‌ మీద నెట్టేస్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణలో టెస్టులు చేస్తున్న పదహారు ప్రైవేటు ల్యాబుల్లో పదమూడింటికి ప్రభుత్వం నోటీసులు జారీ...

అమరావతికి ఎయిర్‌పోర్టు ఉందా..? రైల్వే స్టేషన్ ఉందా..?

అమరావతి పోరాటం విషయంలో ప్రభుత్వం ఎదురుదాడి చేయడానికి విచత్రమైన కారణాలను ఎదుర్కొంటోంది. ఉద్యమం ప్రారంభమై 200 రోజులు అయిన సందర్భంగా పెద్ద ఎత్తున దేశ, విదేశాల నుంచి రైతులకు సంఘిభావం తెలియచేశారు. ఈ...

కాళేశ్వరం సబ్ కాంట్రాక్టర్లు ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలా..?

కొండపోచమ్మ సాగర్ కాలువకు పడిన గండిని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాజకీయంగా ఉపయోగపడుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అతి సమీపంలో ఉండే వెంకటాపూర్ గ్రామాన్ని ఆ నీరు ముంచెత్తింది. అయితే.. సమస్య అది...

HOT NEWS

[X] Close
[X] Close