అన్న ఆలోచన : బాలికలకు ఉచిత నేప్‌కిన్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న బాలికల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నలా ఆలోచించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యకు సావధానంగా పరిష్కారం చూపించారు. 7 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థినిలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని నిర్ణయించారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్‌కిన్స్‌ను మాత్రమే పంపిణీ చేయనున్నారు. మార్చి ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం రోజున ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే వెంటనే పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాదు. ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి..ఆ నెలాఖరు నాటికి ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక యంత్రాలు అమరుస్తారు. జూలై 1 నుంచి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.

ఒక్కో బాలికకు నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్‌కిన్స్‌ను ఇస్తారు. ఇందు కోసం రూ. 40 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారందరూ దాదాపుగా నిరుపేదలే. ఏ మాత్రం ఆర్థిక స్థోమత ఉన్నా… తమ పిల్లల్ని ప్రైవేటు బడికి పంపుతున్నారు. ప్రభుత్వ బడులకు వచ్చే బాలికలకు సరైన అవగాహన లేకపోవడంతో.. ఇబ్బంది పడుతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటికే అనేక స్వచ్చంద సంస్థలు… విద్యార్థినులకు న్యాప్ కిన్స్ అందించేందుకు ప్రయత్నాలు చేశాయి. అయితే ఖర్చు కారణంగా ఈ సేవలు పరిమితంగానే ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా ఆర్భాటంగా ఇలాంటి ప్రకటనలు చేశాయి. అయితే అమలులో మాత్రం ఆరంభశూరత్వమే కనిపించింది.

ఈ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో చూడాల్సి ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభిస్తున్నారు కానీ… జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రారంభించిన తేదీ నుంచి నాప్ కిన్స్ ఇస్తారేమోనని స్కూళ్లలో విద్యార్థులు చూడటం సహజమే. కానీ ప్రభుత్వం ఇవ్వదు. జూలై ఒకటి నుంచి ఇస్తారో లేదో అప్పటి సంగతి.కానీ ఇప్పటికే ప్రచారం చేసుకుంటే చాలన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఎందుంటే ప్రతి ఒక్కరికి మూడు మాస్క్‌లు ఇస్తామని సీఎం జగన్ ప్రకటిస్తే.. అధికారులు ఇంత వరకూ అమలు చేయలేదు.అలానే ఈ పథకాన్ని నీరు గారిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నపై స్టింగ్ ఆపరేషన్..!

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రైవేటు సంభాషణలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలను వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. ప్రధానంగా...

కర్ణాటక డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు – రాజకీయ కుట్ర ఉందా ?

తెలంగాణ రాజకీయ నేతలపై బెంగళూరు పోలీసులు మీడియాకు ఇస్తున్న లీకులపై తెలంగాణ రాజకీయ నేతల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుమానిస్తున్నారు. బెంగళూరులో అధికారంలో ఉన్న బీజేపీనే .... డ్రగ్స్...

టాలీవుడ్ కి ఉగాది శోభ‌

పోయిన ఉగాది... `క‌రోనా` పుణ్యాన రుచీ ప‌చీ లేకుండా చ‌ప్ప‌గా సాగిపోయింది. ఈసారి క‌రోనా భ‌యాలు ఉన్నా... టాలీవుడ్ లో శోభ క‌నిపించింది. ప్ర‌తీ ఉగాదికీ.. టాలీవుడ్ లో కొత్త సినిమాలు మొద‌లు...

బాల‌య్య టైటిల్ `అఖండ`

బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు. బాల‌కృష్ణ సినిమా కోసం ఓ కొత్త టైటిల్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ...

HOT NEWS

[X] Close
[X] Close