అమరావతి ప్రాజెక్టుల్లో మళ్లీ కదలిక..! ప్రభుత్వం వ్యూహం మారిందా..?

అమరావతిని ఎక్కడిక్కడ నిలిపివేసి.. ఏడాది దాటిపోయింది. స్మశానం.. ఎడారిగా తీర్మానించేసి కూడా.. చాలా కాలం అయింది. అక్కడ నిర్మాణాలు జరగడం లేదు. అప్పటి కాంట్రాక్టర్లు.. తెచ్చుకున్న ఇసుకను కూడా.. ఈ మధ్య తరలించుకుపోయారు. ప్రభుత్వం నిర్మాణ పనుల మీద సమీక్షలు ఎప్పుడో మానేసింది. అక్కడ భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనే కాన్సెప్ట్‌ మీద పని చేస్తోంది. అయితే.. హఠాత్తుగా.. రెండు రోజుల కిందట.. కొన్ని వర్గాల మీడియాకు ఓ సమాచారం వచ్చింది. అదేమిటంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణాలపై సమీక్ష చేశారని… 70శాతం పూర్తయిన ప్రాజెక్టులను పూర్తి చేయమని సూచించారని.. ఆ సమీక్ష సమావేశ లీక్ సారాంశం.

చివరికొచ్చిన నిర్మాణాలను పూర్తి చేస్తామంటున్న ప్రభుత్వం..!

అమరావతిలో నిర్మాణాల పూర్తి అనే మాట వస్తేనే.. చాలా ఎఫెక్టివ్ న్యూస్ వచ్చినట్లే. ఎందుకంటే.. ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే నిన్నామొన్నటి వరకూ లేదు కాబట్టి.. స్వయంగా సీఎం సమీక్ష చేసి.. నిర్మాణాలపై సమీక్ష చేశారని తెలిపే సరికి.. చాలా మందిలో ఉత్కంఠ ప్రారంభమయింది. ఏడాది కిందట… అధికారం చేపట్టినప్పుడు.. అమరావతిలో అంతా అవినీతే.. అవినీతిని వెలుగులోకి తెచ్చి… ఆ తర్వాత నిర్మాణాలు చేపడతామన్నారు. అప్పట్నుంచి అనేక మలుపులు తిరిగింది అమరావతి వ్యవహారం. ఏడాది తర్వాత అవినీతి వెలుగులోకి రాలేదు. పాత కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదు. నిర్మాణాలు శిధిలమయ్యే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం… 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టిపెట్టినట్లు బయటకు సమాచారం పంపారు.

హఠాత్తుగా అమరావతిపై ప్రభుత్వ ఫోకస్ ఎందుకు..!?

అమరావతిలో 70 శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేస్తే.. ఉద్యోగులందరికీ క్వార్టర్స్ లభిస్తాయి. ఎమ్మెల్యేల క్వార్టర్లు వస్తాయి. ప్రభుత్వం నడపడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ లభిస్తాయి. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. వాటిని పూర్తి చేస్తే.. విశాఖను వైజాగ్ తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే.. అక్కడ మళ్లీ అన్నీ కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అమరావతిలో అన్నీ అందుబాటులో ఉంటే.. అక్కడకు ఎందుకు అన్న చర్చ వస్తుంది. అది రాకుండానే అమరావతిలో ఏమీ లేదు అని చెప్పడానికే.. నిర్మాణాలు నిలిపివేశారని అంటూంటారు. కానీ ఇప్పుడు మళ్లీ కడతామని అందరూ ఆశలు వదిలేసుకున్న తర్వాత ప్రభుత్వం సంకేతాలు పంపుతోంది.

విశాఖకు వెళ్లబోయే సీఎం ఇంటికి కోట్లతో మరమ్మత్తులెందుకు..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… మొదట్లో తన ఇంటి కోసం దాదాపుగా ఏడున్నర కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడానికి జీవోలు ఇచ్చారు. విశాఖకు రాజధానిని మార్చాలనుకున్న తర్వాత ఆ జీవోలను రద్దు చేశారు. కానీ ఇటీవలి కాలంలో.. మళ్లీ తన నివాసం కోసం… ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. వివిధ రకాల పనులు చేయించినట్లుగా జీవోలు వచ్చాయి. వీవీఐపీ ఇళ్ల ఖర్చు కోసం అని జీవోలు ఇచ్చినా.. అవి సీఎం ఇంటి కోసమేనని చెబుతున్నారు. అప్పుడు అపేసి.. ఇప్పుడు ఖర్చు పెడుతూండటం… అమరావతి నిర్మాణాలు చేయాలని అనుకోవడం.. మారుతున్న ప్రభుత్వ వ్యూహానికి సంకేతమా అన్న చర్చ జరుగుతోంది. ఏమిటనేది.. ముందు ముదు తీసుకోబోయే నిర్ణయాలతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close