సీఓటర్ సర్వే : కేసీఆర్ కన్నా జగన్ పాపులారిటీనే చాలా..చాలా ఎక్కువ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా… ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్. ఈ విషయాన్ని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై ఈ సంస్థ సర్వే చేసింది.. మోస్ట్ పాపులర్.. లీస్ట్ పాపులర్ సీఎంల జాబితా విడుదల చేసింది. మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో జగన్మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో ఉండగా.. లీస్ట్ పాపులస్ సీఎంల జాబితాలో కేసీఆర్ చిట్ట చివరిగా ఉన్నారు. మోస్ట్ పాపులర్‌లో మొదటి స్థానం ఒడిషా సీఎంకు.. రెండో స్థానం చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బఘెల్‌కు మూడో స్థానం కేరళ సీఎంపినరయి విజయన్‌కు దక్కింది. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో…అద్భుతంగా పని చేశారన్న ప్రశంసలు కొంతకాలంగా వస్తున్నాయి.

ప్రెస్‌మీట్లు పెట్టి ప్రజలకు ధైర్యం ఇవ్వడంలో ఆయన చూపిన చొరవ.. ఏపీ ప్రజల్ని కూడా ఆకట్టుకుందని చెప్పుకున్నారు. అయితే ఆయన దేశంలో లీస్ట్ పాపులర్ సీఎంలలో అట్టడుగున ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా సీఓటర్ సర్వే పట్టం కట్టింది. ఆయనకు ఆరవై ఐదు శాతం మందికిపైగా మద్దతు పలికారు.రాహుల్ గాంధీకి 30శాతం మందికిపైగా మద్దతు పలికారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్పందన కూడా… ఆశ్చర్య పరిచేలా ఉంది. గతంలో..మోదీ ప్రభుత్వ పనితీరుపై..దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది.కేరళ,తమిళనాడుతో పాటు ఏపీలోనూ వ్యతిరేకత తీవ్రంగా కనిపించేది.

కానీ ఈ సారి మాత్రం.. కేంద్రం పనితీరును..మెచ్చిన టాప్ త్రీ రాష్ట్రాల్లో ఏపీ ఉన్నట్లుగా సీఓటర్ సర్వే వెల్లడించింది. 83 శాతానికిపైగా ఆంధ్రప్రజలు మోడీ సమర్థతను ప్రశంసించారని.. సీఓటర్ సర్వే చెబుతోంది. ప్రధానమంత్రి..కేంద్ర ప్రభుత్వ పనితీరు సంగతేమో కానీ.. ఏపీ,తెలంగాణ సీఎంల పాపులారిటీ విషయంలో మాత్రం సీఓటర్ సర్వే అందర్నీ ఆశ్చర్యపరిచేదే. కేసీఆర్.. తీసుకుంటున్న చర్యలకు తెలంగాణ ప్రజలే కాదు.. ఏపీ ప్రజలూ మద్దతు పలికారని గతంలో చెప్పుకున్నారు. కానీ సీ ఓటర్ సర్వేలో దేశంలోనే అయన అత్యంత లీస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చినసీఎంగా నిలిచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ దళిత రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే..!

నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.....

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

HOT NEWS

[X] Close
[X] Close