అర్జంట్..! మళ్లీ సుప్రీంకోర్టులో అప్లికేషన్ పెట్టిన ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల శంకుస్థాపన కోసం… ఉన్న అడ్డంకులన్నీ అధిగమించడానికి హడావుడి పడుతోంది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలంటూ.. రెండు రోజుల కిందట.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. సోమవారం విచారణకు వస్తుందని ఏపీ సర్కార్ అనుకుంది. అయితే..రాకపోవడంతో వెంటనే..విచారించాలంటూ.. మరో అప్లికేషన్ ను దాఖలు చేసింది. అయితే.. ఇప్పటికే.. అమరావతి రైతులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు కేవియట్ పిటిషన్లు వేశారు. ప్రభుత్వ పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదన వినాలని కోరారు.

ఈ పిటిషన్‌ కాపీని కెవియట్‌ వేసిన వారికి తామే పంపినట్లుగా ప్రభుత్వం తాజా అప్లికేషన్‌లో తెలిపింది. అందుకే వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం కోరింది. పదహారో తేదీన మూడు రాజధానులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానిని ఆహ్వానించడానికి జగన్ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. అయితే కోర్టుల్లో కేసులుంటే.. శంకుస్థాపన సాధ్యం కాదు. అందుకే.. వీలైనంత త్వరగా… న్యాయ పరమైన చిక్కులను అధిగమించాలని ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నిస్తోంది.

వాస్తవానికి .. ప్రభుత్వం 14వ తేదీ కల్లా..ఈ అంశంపై కౌంటర్లు దాఖలు చేస్తామని హైకోర్టుకు తెలిపింది. అందుకే.. హైకోర్టు పధ్నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయాల్సిఉంది. కానీ ఈ లోపే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పుడు పధ్నాలుగో తేదీలోపు ..సుప్రీంకోర్టులో విచారణ జరగకపోతే.. ఆ రోజున..ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినా… హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సహజంగా సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నందున అక్కడ పరిష్కారం అయిన తర్వాతే దానికి సంబంధించిన పిటిషన్లను హైకోర్టు విచారిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close