పాట‌ల‌తో ప‌గ తీర్చుకుంటున్న జొన్న విత్తుల‌

టీవీ ఛాన‌ళ్ల డిబేటులో వ‌ర్మ – జొన్న విత్తుల ఎపిసోడ్ ఓ రేంజులో న‌డిచింది. ఇద్ద‌రూ సై అంటే సై అంటూ వాదించుకున్నారు. ఆ వాద‌న‌లో కొన్నిసార్లు వ‌ర్మ‌ది పై చేయి అయితే, ఇంకొన్నిసార్లు జొన్న‌విత్తుల‌ది పై చేయిగా మారింది. ఆనాడే `నీపై సినిమా తీసి.. నువ్వేంటే ఏమిటో జ‌నాల‌కు చూపిస్తా` అంటూ శ‌ప‌థం చేశారు జొన్న‌విత్తుల‌. అనుకున్న‌ట్టే `ఆర్‌జీవి` (రోజూ గిల్లే వాడు) అనే పేరుతో ఓ సినిమా మొద‌లెట్టారు. ఇప్ప‌టికి రెండు పాట‌ల్ని విడుద‌ల చేశారు. `ఓడ్కా మీద ఒట్టు.. నేబ‌డ్క‌వ్ నా కొడుకుని` అంటూ.. తొలి పాట విడుద‌ల చేశారు. ఈ పాట సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు రెండో పాట వ‌దిలారు.

`ద‌య్యంతోనే అన్నీ చేయాల‌నుకుంటాడే వీడు
క‌ల్లోకొచ్చిన కాష్మోరాతో కక్కుర్తి ప‌డ‌తాడు` అంటూ వ‌ర్మ దెయ్యాల్నీ వ‌ద‌ల‌డు అనే రేంజులో పాట రాశారు. తొలి పాట‌లో వ‌ర్మ నైజాన్ని బ‌య‌ట‌పెడితే, రెండో పాట‌లో.. వ‌ర్మ‌లోని దాదాపు అన్ని `యాంగిల్స్‌`నీ బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ రెండు పాట‌ల్నీ రాసింది జొన్న విత్తులే.

సృష్టిలో వీడంత శృంగార ద్రోహి ఎవ‌డూ లేడు
ఎగ్సార్సిస్టుకి రిబ్బ‌న్ క‌ట్టి ఎక్స్‌పోజ్ చేస్తాడు
క‌సిలో ఖ‌రుడు
మ‌స‌లి జ‌డుడు
సెక్సోన్మాదుడు
దుష్‌బ్ర‌స్టుడు… అంటూ… ఏ రేంజులో ఆడుకున్నాడు. ఇలాంటి పాట‌లు ఇంకో రెండున్నాయట ఈ సినిమాలో. మొత్తానికి జొన్న విత్తుల వ‌ర్మ‌పై రివైంజ్ తీర్చుకోవ‌డానికి బాగానే ప్రిపేర్ అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close