ఢిల్లీ లాయర్లకు రూ. 4 కోట్ల 67 లక్షల ప్రజాధనం..!

ఏపీ ప్రజాధనం దాదాపుగా రూ. నాలుగు కోట్ల అరవై ఎడు లక్షల రూపాయలను ఢిల్లీ లాయర్లకు ఫీజుగా చెల్లించింది ప్రభుత్వం. ఈ మేరకు నిధులు విడుదల చేసి.. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చింది. చెల్లింపులు చేయాలని చెప్పింది. జీవోలో మాత్రం చెల్లింపులు ఏ యే లాయర్లకు ఎంత మొత్తం చెల్లించాలన్నదానిపై వివరాలు లేవు. వాటిని రహస్యంగా ఉంచారు. నెల వారీగా రాష్ట్రంలో హైకోర్టులో వాదించే లాయర్ల కోసం విడిగా జీవోలిస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చిన జీవో కేవలం ఢిల్లీలో అంటే సుప్రీంకోర్టులో వాదించే లాయర్ల కోసమన్నమాట.

ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు హైకోర్టులో వీగిపోతున్నాయి. అత్యధిక సార్లు సుప్రీంకోర్టుకు వస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద లాయర్లను మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వం తరపున అయినా… మరో విధంగా అయినా ప్రముఖ లాయర్ల ఫీజులు.. గంటల్లో వసూలు చేస్తారు. అది లక్షల్లో ఉంటుంది. ఇలా ప్రముఖ లాయర్లనే ఏపీ ప్రభుత్వం మాట్లాడుకుంది. రాజధాని అంశం నుంచి … అన్ని కేసుల్లోనూ సుప్రీంకోర్టుకు వచ్చింది. ఇలా వాదించినందుకు.. లాయర్లకు బిల్లులు రూ. కోట్లకు చేరాయి. ఇప్పుడు వాటిని వాదించాల్సి వచ్చింది. ఇంతా చేసి ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పుల్ని ఆ లాయర్లు తీసుకొచ్చారా అంటే అదీ లేదు.. ప్రభుత్వానికి ఇప్పుడే బుద్ది వచ్చింది.. పిటిషన్లు ఉపసంహరించుకుంటామని కొన్ని కేసుల్లో వాదించాల్సి వచ్చింది.

ప్రభుత్వానికి న్యాయసలహాదారులు ఉన్నారు. ఆ పేరు లేకపోయినా అన్ని అంశాల్లో వేలు పెట్టే సలహాదారులు ఉన్నారు. నిర్ణయాలన్నీ వారే తీసుకుంటారో.. ముఖ్యమంత్రి చెప్పిన మేరకు నడుచుకుంటారో కానీ… చాలా స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కోర్టులు కొట్టి వేస్తాయని తెలిసినా .. కింది కోర్టు.. పైకోర్టు.. డివిజన్ బెంచ్ అంటూ కోర్టుల చుట్టూనే తిరుగుతున్నారు కానీ ప్రయోజనం ఉండటం లేదు. లాయర్లకు మాత్రం రూ. కోట్లకు కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అయినా తమ సొమ్మేం పోయింది.. ప్రజాధనమేగా అనుకుంటున్న ప్రభుత్వం… అది తప్పని అనుకోవడం లేదు.. దుబారా అని కూడా అనుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close