ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెపపింది. సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం మొదటి విడత డీఏ బకాయిలు విడుదలచేసింది. హఠాత్తుగా తమ ఖాతాల్లో పడిన డబ్బులను చూసి.. ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. CPS ఉద్యోగుల DA ఎరియర్స్ AP సెక్రటేరియట్ సీపీఎస్ ఉద్యోగులకు జమ చేసింది.. త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ 90% బకాయిలు నగదుగా చెల్లించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సుమారు ఆరు విడుతలుగా ఈ మొత్తం చెల్లింపుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి 40వేలు నుంచి 70వేలు వరకు నేడు అకౌంట్లకు జమచేసిన ప్రభుత్వం మిగిలిన వారికి 6 విడుతల్లో ఒక్కో ఉద్యోగికి 2నుంచి 4 లక్షల వరకూ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జగన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చి ..డీఏలు ఎగ్గొట్టారు. దీంతో మొత్తం బకాయిలు పేరుకుపోయాయి.
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు డిమాండ్ చేయకపోయినా వారికి న్యాయంగా చెల్లించాల్సిన వాటిని చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనూ ఓ సారి బకాయిలు చెల్లించారు. ఇప్పుడు మరోసారి చెల్లించారు. ఇటీవల ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారు పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వంతో వారు వ్యవహరించిన తీరు వల్ల.. ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేకపోతున్నారు.