ఏడాది ఉద్యమం : త్యాగం చేసిన రైతులకు న్యాయం ఎప్పుడు..?

రోడ్డు వెడల్పు చేయాలంటే తమ స్థలం తీసుకోవద్దని కోర్టుకెళ్లే వాళ్లు పదుల సంఖ్యలో ఉంటారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదని రచ్చ చేసేవారు కొందరుంటారు. అసలు ప్రభుత్వం మీద నమ్మకం లేని వాళ్లు మరికొందరు ఉంటారు. పరిశ్రమ కోసం ఎక్కడైనా భూసేకరణ చేయాలంటే “నందిగ్రామ్” లాంటి ఘటనలు లేకుండా జరగడం అసాధారణం. అలాంటిది.. ఒకటి కాదు.. వంద కాదు.. వెయ్యి కాదు.. ముప్పై మూడు వేల ఎకరాల భూముల్ని దాదాపుగా 29వేల మంది రైతులు పైసా పరిహారం తీసుకోకుండా ఇచ్చారు. తర్వాత వారికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్నది దైవాధీనం. కానీ.. రాష్ట్రం కోసం వారు త్యాగం చేశారు. జీవనోపాధి కల్పించిన భూముల్ని ఇచ్చారు. కానీ వారికి తిరుగుటపాలో లాభం రాలేదు. ఎంతో వచ్చేస్తుందని .. వారు అపర కుబేరులయిపోతారన్న జెలసీ మాత్రం వారిపై అన్ని ప్రాంతాల వారు కల్పించుకున్నారు. ఆ జెలసీని విద్వేషంగా మారిన నాటి ప్రతిపక్షం.. నేటి పాలక పక్షం.. అదే పునాదిగా మూడు రాజధానులకు శ్రీకారం చుట్టింది. మొత్తాని ఆ రైతుల్ని నిట్ట నిలువుగా మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. చేసింది కూడా.

ఏడాదిగా పోలీసుల గుప్పిట్లో రాజధాని రైతు..!

ఏడాదిగా అమరావతి రైతులు లాఠీ దెబ్బలు తింటున్నారు. తిట్లు భరిస్తున్నారు. ఇంట్లో ఆడవాళ్లను సోషల్ మీడియా పేరుతో వేదికగా అసభ్యంగా చిత్రీకరిస్తున్నా సహిస్తున్నారు. సభ్యత, సంస్కారం లేకండా రాజకీయ పార్టీల నేతలు కూడా ఉద్యమాల్లో పాల్గొంటున్న మహిళల వేష, భాషల గురించి మాట్లాడుతున్నారు. అయినా వారు ఎప్పుడూ గీత దాటలేదు.అరెస్టులు, ఆంక్షలు, 144 సెక్షన్లు, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్‌తో నిర్భంధాలతో ఏడాదిగా సహజీవనం చేస్తూనే ఉన్నారు. అడుగుకో పోలీస్‌ పికెట్‌తో చేయడంతో రాజధాని గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎక్కడైనా భూములు లాక్కోవడానికి పోలీస్ పికెట్‌లు పెడతారు కానీ అమరావతిలో మాత్రం భిన్నం.

మనోవేదనతో చనిపోయిన పాపం ఎవరిది..?

ప్రాణప్రదంగా చూసుకున్న భూములు ఏమవుతాయోనని, మానసిక వ్యధతో కొందరు గుండెలు ఆగిపోయి.. మృతి చెందారు. అయినా ప్రభుత్వానికి కనికరం కలగలేదు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. మరోవైపు అమరావతి కోసం అసువులు బాసిన రైతుల కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ అమరావతి రైతులపై కేసులు పెడుతుండడం.. ఉద్యమాన్ని అణచివేస్తుండడంతో తీవ్ర ఆవేదనకు గురైన మరికొందరు రైతులు అశువులుబాశారు. దీంతో కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాలు దిక్కులేనివిగా మారిపోయాయి. అమరావతికి భూములిచ్చిన రైతుల వేదన వర్ణనాతీతం. భూములిచ్చిన వారందరూ చిన్న సన్నకారు రైతులే. రాజధాని తరలిపోతుందని ఆవేదన, ఇక్కడ నిర్మాణాలు నిలిచిపోవడంతో పిల్లల భవిష్యత్తుపై అందరికీ బెంగే. రాజధానిలో ఏ చిన్న రైతును కదిపినా ఓ విషాదం వినిపిస్తుంది.

ప్రభుత్వమే అన్యాయం చేస్తే ఇక రాజ్యాంగాలెందుకు..?

ఎవరైనా తమకు మేలు కలిగితేనే ప్రభుత్వానికి సహకరిస్తారు. ప్రభుత్వంపై నమ్మకం కూడా ఉండాలి. అలా నమ్మకం పెట్టుకుని రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పుడు మిగులుతోంది అవమానాలు.. లాఠీదెబ్బలతో పాటు సర్వం కోల్పోవడం కూడా. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయే ప్రమాదం కూడా వచ్చింది. ఇక ఎవరూ ప్రభుత్వాలపై ఎలాంటి నమ్మకమూ పెట్టుకోలేరు. మూడు రాజధానులు కాకపోతే ముఫ్పై రాజధానులు పెట్టుకోవచ్చు. ప్రజలు ఓట్లు వేసిఅధికారం ఇచ్చినప్పుడు… రాజ్యాంగం ప్రకారం ఎన్నెన్ని చేయవచ్చో అన్నీ చేసుకోవచ్చు.కానీ ప్రభుత్వాన్నే నమ్మిన రైతుల్ని మోసం చేయమని… వేధించమని ఏ రాజ్యాంగమూ చెప్పదు. వారికి న్యాయం చేయకపోతే.. ఏ ప్రభుత్వమైనా తనకు తాను న్యాయం చేసుకోనట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close