బీజేపీకి రివర్స్ పంచ్..! తిరుపతిలో జనసేన రెడీ..!

తిరుపతి లోక్‌సభ సీటును బీజేపీకి ఇవ్వడానికి పవన్ కల్యాణ్ అంగీకరించారంటూ…సోము వీర్రాజులాంటి వాళ్లు ప్రచారం చేస్తూ పోతున్నా… జనసేన వైపు నుంచి స్పందన లేదు. కానీ.. ప్రతిస్పందన మాత్రం రీ సౌండింగ్ వచ్చేలా ఇస్తున్నారు పవన్ కల్యాణ్. తిరుపతి విషయంలో జనసేననే పోటీ చేస్తుందన్న సంకేతాలను గట్టిగానే పంపుతున్నారు. తిరుపతి లోక్‌సభ పరిధిలో జనసేన కార్యనిర్వాహక కమిటీని పవన్ కల్యాణ్ హఠాత్తుగా ప్రకటించారు. కమిటీ సభ్యులుగా డా.పి.హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, రాందాస్ చౌదరి, కిరణ్ రాయల్, శ్రీమతి వినుత, పొన్న యుగంధర్, ఉయ్యాల ప్రవీణ్, తీగల చంద్రశేఖర్, గూడూరు వెంకటేశ్వర్లు, కంటేపల్లి ప్రసాద్‌ని నియమించారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ వ్యవహారాలన్నింటినీ వీరు చూసుకుంటారు.

తిరుపతి ఉపఎన్నిక నేపధ్యంలో జనసేన కమిటీ ఇప్పుడు.. బీజేపీలోనూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయుకుండా వెనక్కి తగ్గిన తర్వాత జనసేన పార్టీ క్యాడర్ నిరుత్సాహానికి గురైంది. తిరుపతిలో పవన్ కల్యాణ్ అలాంటి నిర్ణయం తీసుకోబోరన్న నమ్మకంతో వారున్నారు. దానికి తగ్గట్లుగానే పవన్ కల్యాణ్.. తిరుపతి విషయంలో గట్టిగానే ఉన్నారు. కానీ పవన్ కల్యాణ్ మొహమాటాన్ని ఆసరాగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ నేతలు.. ఆయన తరపున ప్రకటనలు చేసేస్తూ.. తామే పోటీ చేస్తామని..జనసేన మద్దతిస్తుందని చెబుతున్నారు. ఓ అడుగు ముందుకేసి.. నడ్డా వద్ద పవన్ ఒప్పుకున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు.

బీజేపీ నేతల ప్రచారం.. జనసేన అగ్రనాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. అయితే పొత్తు పరధి వారు దాటినా తాము దాటకూడదన్న అభిప్రాయంతో ఉన్నారు. అలాగని.. తమ రాజకీయం తాము చేయకుండా ఉండే ప్రసక్తే లేదని లోక్‌సభ కమిటీని ప్రకటించడం ద్వారా స్పష్టం చేశారు. జనసేన తరపున తిరుపతి నుంచి పోటీ చేయడానికి పలువురు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పవన్ కల్యాణ్‌ను సంప్రదిస్తున్నారు. పవన్ కల్యాణ్ మదిలో కూడా ఓ ఇంటలెక్చువల్ అయిన మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన అడుగులు చూస్తూంటే.. తిరుపతి సీటు విషయంలో బీజేపీ అత్యుత్సాహం నవ్వులపాలయ్యే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close