అధికార దుర్వినియోగం నిజం..! ఇక పాలించే అర్హత ఉందా..!?

అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లుగా తేలిన తర్వాత ఎవరూ ఆ అధికారంలో కొనసాగడానికి అర్హులు కారు. నిబంధనల ప్రకారం తొలగించడానికి అవకాశం లేకపోయినా… బలవంతంగా అయినా అలా దుర్వినియోగం చేసినవారిని పంపేస్తారు. అత్యున్నత మేనేజ్‌మెంట్ ప్రమాణాలు పాటించే కార్పొరేట్ కంపెనీల్లో అయినా… ప్రజలను మరింత మెరుగైన వ్యవస్థ వైపు నడిపించాల్సిన ప్రభుత్వాల్లో అయినా జరిగేది ఇదే. అయితే.. ఇప్పుడు సంస్థ.. లేదా ప్రభుత్వమే అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏం చేయాలి..? దాని యజమాని బాధ్యత తీసుకోవాలి. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ డైలమా ముందు ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక అంశాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని… చట్టం, రాజ్యాంగాలను పట్టించుకోవడం లేదని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. అయితే తొలి సారిగా హైకోర్టు ఈ విషయాలను ధృవీకరించింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ..రాత్రికి రాత్రి సంచైత అనే మహిళను చైర్మన్‌గా నియమించడంపై దాఖలైన పిటిషన్ విషయాన్ని విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పులో సంచలన వ్యాఖ్యలు చేసింది. సంచైత నియామకాన్ని హైకోర్టు కొట్టి వేసిన తీర్పు లో కీలకమైన వ్యాఖ్యలు ఉన్నాయి. అందులో.. ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా హైకోర్టు నిర్ధారించింది.

కేవలం అశోక్ గజపతిరాజును తొలగించడానికే.. సంచైతకు చైర్మన్ పదవి ఇవ్వడానికే ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా…అధికార దుర్వినియోగం చేస్తూ..ఆ పని పూర్తి చేశారని హైకోర్టు ఆక్షేపించింది. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలు న్యాయ.. రాజకీయవర్గాల్లో సంచలనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు ఇచ్చినఅధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం కాకుండా రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేసినట్లుగా తేలడమే దీనికి కారణం. నైతికంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారికి పదవిలోఉండే అర్హత లేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి వాటిని పట్టించుకోలేదు. ఇలాంటి పరిస్థితులకే రాజీనామాలు చేయాల్సి వస్తే.. కనీసం ఇప్పటికి వంద సార్లు రాజీనామా చేసి ఉండాల్సిందని అంటున్నాయి.

రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. రాజ్యాంగ పాలన చేయకుండా… కోర్టుల్లో చీవాట్లు తింటూ ప్రతి నిర్ణయమూ రాజ్యాంగ విరుద్ధమన్నట్లుగా సాగుతున్న పాలనపై… ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో కానీ… న్యాయస్థానాలు మాత్రం… అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close