ఓంకార్ ఆ ‘గ‌ది’లోంచి బ‌య‌ట‌కు రాడా?

తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు పెద్ద‌గా క్లిక్ అవ్వ‌లేదు. అయినా అలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఓంకార్ అయితే.. `రాజుగారి`కి గ‌ది`మీద గ‌ది క‌డుతూనే ఉన్నాడు. `రాజుగారి గ‌ది` హిట్ట‌వ్వ‌డంతో… 2, 3 కూడా రంగంలోకి దింపాడు. కానీ.. తొలి సినిమా చూపించినంత ఎఫెక్ట్ మిగిలిన రెండు సినిమాల్లోనూ రాలేదు. పార్ట్ 2లో నాగార్జున‌ని తీసుకొచ్చినా, పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. పార్ట్ 3 అయితే త‌మ్ముడ్ని హీరోగా నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం క‌నిపించింది. అయితే అది కూడా దారుణంగా బెడ‌సి కొట్టింది. టీవీ షోల ద్వారా సంపాదించిందంతా.. ఈ సినిమాల‌పైనే ఖ‌ర్చు పెట్టేశాడు ఓంకార్‌. `రాజుగారి గ‌ది 3` త‌ర‌వాత‌.. మ‌ళ్లీ సినిమాల‌కు దూర‌మై, టీవీ షోల‌తో స‌రిపెట్టుకున్నాడు.

అయితే ఇప్పుడు `రాజుగారి గ‌ది 4` కూడా తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. క‌థ సిద్ధ‌మైంద‌ని, త‌న త‌మ్ముడే హీరో అని డిక్లేర్ చేశాడు. వ‌రుస‌గా దెబ్బ మీద దెబ్బ ప‌డుతున్నా ఓంకార్ ఎందుకో రాజుగారి గ‌దినే న‌మ్ముకున్నాడు. హార‌ర్ కామెడీ సినిమాల కాలం చెల్లిపోయింది. ఓర‌కంగా.. ఈ జోన‌ర్ లో వ‌చ్చిన సినిమాల్లో హిట్ట‌యిన చివ‌రి సినిమా రాజుగారి గ‌దినే. ఆ త‌ర‌వాత‌…. వంద సినిమాలొచ్చినా, అందులో ఒక్క‌టీ హిట్ అవ్వ‌లేదు. ఓంకార్ కి స్వ‌యంగా రెండు దెబ్బ‌లు త‌గిలాయి. అయినా అదే జోన‌ర్ నీ, అదే టైటిల్ నీ న‌మ్ముకుని వ‌స్తున్నాడు. క‌నీసం టైటిల్ అయినా మార్చ‌డం లేదు. ఏంటో.. ఓంకార్ కి అంత న‌మ్మ‌కం..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close