ఆ ఇంటర్నేషనల్ “డమ్మీ కంపెనీ”కి 25 ఎకరాలు..!

ఏపీ ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి లేఖ రాసింది. పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి విశాఖలో పాతిక ఎకరాల స్థలం ఇస్తామని పెట్టుబడులు పెట్టాలని లేఖ రాశారు. ఈ లేఖ చూసి.. ఇండస్ట్రీ వర్గాలు పకపకా నవ్వుకుంటున్నాయి. ఎందుకంటే… ఈ ఫ్రాంక్టిన్ టెంపుల్టన్‌ కంపెనీని ఈ ప్రభుత్వ పెద్దలు ఎంత దారుణంగా అవమానించారో.. ఎంత కామెడీ చేశారో ఇంకా కళ్ల ముందే ఉంది మరి.

చంద్రబాబు బినామీ, డమ్మీ కంపెనీగా లోక్‌సభలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు వైసీపీ ఎంపీ బిరుదు..!

కియా పరిశ్రమ ఏపీ నుంచి వెళ్లిపోతోందని రాయిటర్స్ సంస్థ వార్త ప్రచురించినప్పుడు.. లోక్‌సభలో రగడ జరిగింది., ఆ సమయంలో… వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత .. మిధున్ రెడ్డి… ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని డమ్మీ కంపెనీగా సాక్షాత్తూ లోక్‌సభలోనే పేర్కొన్నారు. 30 కోట్ల పెట్టుబడికి వెయ్యి కోట్లు విలువ చేసే భూములు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు బినామీ అని… అదో పెద్ద స్కాం అని ఆరోపించారు. దీనిపై…అప్పట్లో స్వయంగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ కూడా స్పందించింది. తాము ఎంత పెద్ద కంపెనీనో.. తన గొప్ప తనమేంటో.. తమ వెబ్ సైట్ చూసి తెలుసుకోవాలని ట్వీట్ చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టిన, పెట్టాలనుకున్న మల్టినేషనల్ కంపెనీలను.. వైసీపీ నేతలు మిడిమిడి జ్ఞానంతో అవమానపరిచారని ఇండస్ట్రీ వర్గాలు అసహనం వ్యక్తం చేశాయి.

అవమానించి.. భూములు రద్దు చేసి ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటూ లేఖ..!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రాగానే… టీడీపీ ప్రభుత్వంలో పెద్దలు నానా తిప్పలు పడి… అక్కడా ఇక్కడా తిరిగి .. బతిమాలో.. బామాలో తీసుకొచ్చిన కంపెనీలన్నింటినీ వెళ్లగొట్టేశారు. భూముల కేటాయింపులు రద్దు చేశారు. అందులో ఫార్ట్యూన్ -500 కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కూడా ఉంది. విశాఖలో 40 ఎకరాల స్థలంలో హై ఎండ్ ఉద్యోగాలను కల్పించే ఒప్పందంతో.. ఆ సంస్థ తమ సంస్థను అక్కడ పెట్టడానికి చంద్రబాబు హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. వైసీపీ సర్కార్ అది భూమాయ అంటూ రద్దు చేసేసింది. ఆ పార్టీకి చెందిన వారు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి.

పెట్టుబడులు తేవడం అంటే అంత ఆషామాషీ అనుకుంటున్నారా..?

ఫార్ఛ్యూన్ 500 కంపెనీల్లో ఒకటి అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్… అనేక దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇండియాలోనూ ప్రముఖ కంపెనీనే. ఈ కంపెనీ.. తమ ప్రీమియమ్ ఆఫీసును విశాఖలో పెట్టాలని నిర్ణయించుకుంది. గత ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ కంపెనీ విశాఖకు రావడం వల్ల.. ఇతర ఐటీ కంపెనీల దృష్టి విశాఖపై పడుతుందని… ఒకప్పుడు హైదరాబాద్‌కు..మైక్రోసాఫ్ట్ ఎలాగో.. ఇప్పుడు విశాఖకు.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ అలా మారుతుందని భావించారు. తీరా వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక… ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. దాంతో.. విశాఖ ఐటీ రంగం ఓ గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్లయింది. ఇప్పుడు ప్రభుత్వం తప్పు తెలుసుకుంది. కానీ ఆ ఫ్రాంక్లిన్ కంపెనీ కనీసం పట్టించుకుంటుందా..? అవమానించిన చోటుకు వస్తుందా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close