డ్రగ్స్ రాకెట్‌లో తెలంగాణ ఎమ్మెల్యేలు..!

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం డ్రగ్ర్స్ కేసు రూపంలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును పోలీసులు చాలాసీరియస్‌గా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఉద్యమకారుడినని చెప్పుకునే ఓ పెద్ద మనిషి డ్రగ్స్ రాకెట్‌లో ప్రధానంగా భాగం అయినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే నటుడు తనీష్‌ను బెంగళూరు పోలీసులు పిలిచి ప్రశ్నించారు. ఈ కేసులోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు… ఇతరులు బయటకు వస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రధానంగా లింకులు కనిపిస్తూండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం బెంగళూరు పోలీసులు సన్నాహాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై స్పష్టత ఉన్నప్పటికీ.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. ఈ కారణంగా మొదట ఓ ఎమ్మెల్యే అరెస్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. నేడో..రేపో సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యమం పేరుతో హడావుడి చేసే వ్యక్తిని కూడా… అరెస్ట్ చేయనున్నారు. ఈయన పైకి ఉద్యమకారుడినని చెప్పుకుంటారు కానీ సినిమాలకు ఫైనాన్స్ చేయడం… క్యాబ్‌ల వ్యాపారం చేయడం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా వాళ్లతో ఏర్పడిన పరిచయాలు… డ్రగ్స్ మార్కెట్‌లో పాలు పంచుకునేదాకా తీసుకెళ్లాయని అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌లో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును విజయవంతంగా తొక్కేశారు. హైదరాబాద్ పోలీసులు దాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో పడేశారు. కానీ… బెంగళూరు పోలీసులు మాత్రం… సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సినీతారల్ని కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీగ మొత్తం లాగుతూంటే… కేసు ఎక్కడెక్కడికో వెళ్తోంది. తాజాగా అది… తెలంగాణ ఎమ్మెల్యేల వద్దకు చేరుతుంది. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే.. రాజకీయంగా పెను సంచలనం నమోదవుతుంది. బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వదిలి పెట్టే అవకాశం కనిపించడం లేదు కాబట్టి… ఆ ముగ్గురు ఎమ్మెల్యేల్లోనూ టెన్షన్ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేంద్రం – కేజ్రీవాల్ మధ్యలో రాకేష్..!

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా రాకేష్ ఆస్థానా అనే అధికారిని మోడీ సర్కార్ నియమించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఆయనను తక్షణం పదవి నుంచి తప్పించాలని కేజ్రీవాల్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఢిల్లీకి...

మీడియా వాచ్ : తెలుగులో ఏబీపీ డిజిటల్..! పెరుగుతున్న ఉత్తరాది ప్రాబల్యం..!

తెలుగు మీడియా రంగంలో ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతోంది. గతంలో తెలుగు మీడియాకు సంబంధించి పత్రికలైనా.. టీవీ చానళ్లు అయినా తెలుగు వారే ప్రారంభించేవారు. గతంలో ఉత్తదారికి చెందిన పెద్ద పెద్ద సంస్థలు మీడియా...

పెట్రో కంపెనీల్నీ అమ్మేస్తున్న కేంద్రం..!

పెట్రో పన్నులు పెంచుతూ ప్రజల వద్ద నుంచి లక్షల కోట్ల ఆదాయం కళ్ల జూస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఆ కంపెనీలను కూడా అమ్మకానికి పెట్టేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎలా వంద...

హుజూరాబాద్‌లో అసలు కన్నా ఫేక్ ప్రచారాలే ఎక్కువ..!

హుజూరాబాద్ ఉపఎన్నిక రాజకీయాల్లో పెరిగిపోతున్న మకిలీ మొత్తాన్ని బయట పెడుతూనే ఉంది. అసలు షెడ్యూలే రాలేదు.. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు.. అన్ని రకాల తెలివి తేటల్నీ ప్రదర్శిస్తున్నాయి....

HOT NEWS

[X] Close
[X] Close