కేంద్రం ఓకే అనకపోతే రూ. పాతిక వేల కోట్లు తిరిగి కట్టాల్సిందే !

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుతో ఏపీ తీసుకున్న రూ. పాతిక వేల కోట్ల రుణం విషయంలో కేంద్రం అభిప్రాయం చెప్పాలని హైకోర్టు నోటీసుల ుజారీ చేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలనిఆదేశించింది. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకుందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది. ఇందులో ఈ అప్పు రాజ్యాంగ విరుద్ధమని.. వివరాలు చెప్పాలని కేంద్రం లేఖ రాసిందని కేంద్రంతో పాటు అప్పులిచ్చిన 8 బ్యాంకులు కౌంటర్‌ దాఖలు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు.

అయితే ధర్మాసనం బ్యాంకులకు నోటీసులు ఇవ్వలేదు. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా అప్పు తేవడం రాజ్యాంగంలోని 266(1) అధికరణకు వ్యతిరేకమని కేంద్రం తెలిపిందో లేదో కౌంటర్‌లో తెలియచేయాల్సి ఉంటుంది. ఒక వేళ నిబధనలకు విరుద్ధంగా ప్రభుత్వం.. రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించి ఈ రుణం తీసుకున్నట్లుగా తేలితే.. ఏపీ ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయంగా భావిస్తున్నారు. ఆ రుణాలను మళ్లీ బ్యాంకులకు వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఖర్చు చేసేసిన రూ. పాతిక వేల కోట్లను వెనక్కి ఇవ్వాల్సి రావడం అసాధ్యమని భావిస్తున్నారు. చివరికి ఈ ఏపీఎస్‌డీసీ రుణం ప్రభుత్వానికి తీర్చుకోలేనిసమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం కరుణించి..కాస్త సానుకూలంగా హైకోర్టుకు నివేదిక ఇస్తే బయటపడతామని ఏపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ...

“అన్నమయ్య”పై కదిలిన కేంద్రం.. రాష్ట్రం కవరింగ్ !

అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన విషాదం వెనుక తప్పిదం ఎవరిదో తేల్చి శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పిన కేంద్ర మంత్రి షెకావత్‌పై వైసీపీ నేతలు...

HOT NEWS

[X] Close
[X] Close