మార్గదర్శిని మూయించి వేస్తామని ప్రభుత్వం హెచ్చరిక !

మార్గదర్శిపై సీఐడీ ఎందుకు కేసులు పెట్టిందంటే… సీఐడీ కొత్త చీఫ్ సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రధానంగా జవాబుదారీ తనం లేదని తేలడంతో ఎఫ్ఐాఆర్‌లు నమోదు చేశారు. అంటే ఒక్క ఖాతాదారుడి నుంచి కూడా ఫిర్యాదు లేదు. .కానీ 7 ప్రాంతాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ ల నుంచి సీఐడీ కి ఫిర్యాదులు వచ్చాయని సీఐడీ చీఫ్ చెప్పారు. విశాఖ,విజయవాడ,రాజమండ్రిగుంటూరు లో ఫోర్ మెన్ ఆఫ్ చిట్స్ ను విచారణ చేశామని.. 1982 చిట్ ఫండ్ ఆక్ట్ 76,79 సెక్షన్ ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని ప్రకటించారు.

అన్ని బ్రాంచ్ ల నుంచి డబ్బు మొత్తం వేరే చోటకు వెళ్ళిపోతుందని.. చిట్టీదారుడకు తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదని.. చెప్పుకొచ్చారు. చిట్టీ కట్టిన వ్యక్తికి తన డబ్బు ఎక్కడుకు వెళ్తుందో చిట్ ఫండ్ కంపెనీ చెప్పాలని రూల్ ఉందని సీఐడీచీఫ్ చెప్పలేదు కానీ ఆయన మాత్రం అదే అర్థం వచ్చేలా మాట్లాడి ఆ కారణంగానే కేసుపెట్టానని చెప్పేశారు. చిట్ ఫండ్ కంపెనీ కస్టమర్ల డబ్బును వేరే చోట ఇన్వెస్ట్ చేయడం చిట్స్ రూల్స్ కు వ్యతిరేకమని… చిట్స్ లో ఎలాంటి నిబంధనలు ఉంటాయో ప్రజలకు తెలియదని సీఐడీ చీఫ్ చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ల అనుమతితోనే చిట్ ప్రారంభించాలన్నారు. మార్గదర్శి కంపెనీ మాత్రం తమ వ్యాపారం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ల అనుమతితోనే ప్రారంభిస్తామని ఎప్పుడో ప్రకటించింది. ఒక వేళ అలా ప్రారంభించిన చిట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి సీఐడీ చీఫ్ చెప్పాల్సింది. కానీ జవాబుదారీ తనం గురించి మాత్రమే ఆయన ప్రకటించారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ కూడా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఫోర్ మెన్ కు ఎలాంటి చెక్ పవర్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధమని… ఏపీలో అడిగితే హైదరాబాద్ లో ఉందని చెప్తారు అక్కడికి వెళ్తే సమాధానం చెప్పడం లేదని అది నేరమని ప్రటించారు. ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. మార్గదర్శి నిధులు ఉషోదయ కంపెనీకి తరలిస్టున్నారని.. ప్రజల సొమ్మును వారికి తెలియకుండా మూచ్యువల్ ఫండ్స్ కు తరలించారన్నారు. సీఐడీ విచారణ తో పాటు చిట్ ఫండ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మార్గదర్శి యాజమాన్యం సహకరించకుండా ఇలాగే కొనసాగితే కంపెనీని మూసివేస్తామని హెచ్చరించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అసెంబ్లీలో 10 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని ఎదుర్కోలేక నైతిక పతనమైన వైసీపీ!

అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి గట్టిగా పదిహేను మంది ఉన్నారు. వారిలో ఐదుగురు సైలెంట్ గా ఉంటారు. మహా అయితే గట్టిగా ఓ పది మంది టీడీపీ సభ్యులు...

కృతిశెట్టికి బూస్ట్ లాంటి ఆఫర్

'ఉప్పెన' సినిమాతో ఒక్కసారి స్టార్ హీరోయిన్ కేటగిరీలో కి వెళ్ళిపోయింది కృతిశెట్టి. నిజంగా ఒక ఉప్పెనలానే ఆమెకు అవకాశలు దక్కాయి. కానీ విజయాలు మాత్రం రాలేదు. ఇండస్ట్రీ విజయాలే కీలకం. అందం, అభినయం...

రాజకీయ బిక్ష పెట్టిన ఎన్టీఆర్ వృత్తినే వైసీపీ అవమానించింది: బాలకృష్ణ

అక్రమ కేసులు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని, ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగేది కాదని, ప్రభుత్వం చంద్రబాబుకు...

‘స్కంద’ మౌనముద్ర !

ఈ 28న వస్తోంది రామ్, బోయపాటి శ్రీనుల స్కంద. ఇప్పటికే సినిమా టీజర్ ట్రైలర్ పాటలు అన్నీ వదిలేశారు. బాలకృష్ణ అతిధిగా ప్రీరిలీజ్ ఈవెంట్ తరహలో ఓ వేడుక కూడా జరిగింది. ఇక...

HOT NEWS

css.php
[X] Close
[X] Close