“ఏబీ”కి నో పోస్టింగ్..! సుప్రీంలో స్టే పిటిషన్ వేసిన సర్కార్..!

ఇంటలిజెన్స్ మాజీ చీఫ్… సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధపడలేదు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. నాన్చి..నాన్చి.. తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. ఆరో తేదీన ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం తీరును ముందుగానే ఊహించిన ఐపీఎస్ వెంకటేశ్వరరావు.. ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారు. తన వాదన వినకుండా.. ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవొద్దని కోరారు.

టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు కొత్త ప్రభుత్వంలో పోస్టింగ్ దక్కలేదు. జీతమూ అందడం లేదు. వెయిటింగ్‌లో పెట్టినన్ని రోజులు పెట్టి తర్వాత అవకతవకలకు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై ఆయన క్యాట్‌కు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్‌ను… హైకోర్టు కొట్టి వేసింది. ఆయనను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ… సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పును కూడా హైకోర్టు పక్కన పెట్టింది.

ఏబీని విధుల్లోకి తీసుకోవాలని మే 22వ తేదీన హైకోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ.. ఇప్పటి వరకూ ప్రభుత్వం సైలెంట్‌గానే ఉంది. ఏబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయబోతున్నారని.. ఉన్నతాధికారవ ర్గాల్లో ప్రచారం ప్రారంభమవగానే… సుప్రీంకోర్టులో సవాల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. మరికొంత కాలం… ఏబీకి పోస్టింగ్… జీతం ఇవ్వకుండా… ఉండవచ్చని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు స్టే ఇస్తే… ఏబీకి ఇబ్బందే .. లేకపోతే.. ఖచ్చితంగా ఏపీ సర్కార్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ రాజధానిపై కేంద్రం తేల్చేసింది..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రానికి సంబంధం లేదని.. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని... కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా.. రాష్ట్ర పరిధిలోనిదా...

రఘురామకృష్ణరాజుకు వై కేటగిరీ సెక్యూరిటీ..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేంద్ర బలగాలు రక్షణ కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు వై కేటగిరి సెక్యూరిటీ కల్పించినట్లుగా సమాచారం అందిందని.. అధికారిక ఆదేశాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని రఘురామకృష్ణరాజు మీడియాకు...

దళిత నేతలతోనే న్యాయస్థానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు..! వైసీపీ స్ట్రాటజీ ఏంటి..?

వైసీపీ రాజకీయ వ్యూహం.. న్యాయవ్యవస్థపై సామాజిక పద్దతుల్లో అమలు చేస్తున్నారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని... దళితుల్ని అడ్డు పెట్టుకుని.. న్యాయవ్యవస్థపై విమర్శలు చేసి.. ఒత్తిడి పెంచే...

రామాలయ భూమిపూజ లైవ్ ఇవ్వని ఎస్వీబీసీ..! బీజేపీ విమర్శలు..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ చూసేలా.. ఏర్పాట్లు చేశారు. చివరికి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ... ప్రసారం చేశారు. అయితే.. అనూహ్యంగా... తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి...

HOT NEWS

[X] Close
[X] Close