“స్టేటస్‌కో ” పై సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల అమలుపై స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ స్టేటస్ కో ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. హైకోర్టును ఎక్స్‌పార్టీగా పేర్కొంటూ ఈ పిటిషన్ దాఖలయింది. ప్రాథమిక కారణాలు తెలియకుండానే… స్టేటస్ కో ఇవ్వడం.. న్యాయసూత్రాలకు విరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. దీనిపై సోమవారం.. సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు కొట్టి వేసి.. స్టే ఇచ్చిన అనేక అంశాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒక్క దాంట్లోనూ… ఏపీ సర్కార్ చేసింది కరెక్టన్న తీర్పు రాలేదు.

నిజానికి హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది.. కేవలం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి అవసరమైన గడువు వరకే. మూడు రాజధానుల బిల్లులు… సీఆర్డీఏ రద్దు చెల్లవంటూ… అనేకానేక కారణాలు చూపిస్తూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు… ప్రభుత్వ వాదన ఏమిటి అని అడిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. అయితే.. తమకు కౌంటర్ దాఖలు చేయాడనికి పది రోజుల సమయం కావాలని ఆ న్యాయవాది కోరారు. దానికి హైకోర్టు అంగీకరించింది. అయితే.. అప్పటి లోపు.. ఎలాంటి తరలింపులు చేయకూడదని… ఆ బిల్లులపై స్టేటస్ కో ఇచ్చింది. ప్రభుత్వం రెండు రోజుల్లో కౌంటర్ దాఖలు చేసి ఉంటే.. హైకోర్టు రెండు రోజుల్లోనే విచారణ జరిపి ఉండేది. కానీ.. హైకోర్టులో కౌంటర్ దాఖలుకు పది రోజులు సమయం అడిగి.. ఈలోపే… ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.

హైకోర్టులో స్టే ఇవ్వలేదు. స్టేటస్ కో మాత్రమే ఇచ్చారు. యథాతథ స్థితిని ఉంచమన్నారు. ఆ బిల్లులను కొట్టి వేయలేదు.. స్టే కూడా లేదు. అంత మాత్రం దానికే.. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని.. హైకోర్టులో… కౌంటర్ దాఖలు చేసి తమ వాదనలు వినిపిస్తే ఏమవుతుందన్న విశ్లేషణ న్యాయవాద వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వానికి న్యాయసలహాలు ఇచ్చేవారు.. ప్రభుత్వ పెద్దలను తప్పు దోవ పట్టిస్తున్నారన్న అనుమానాలను వీరు వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close