రాజధాని రైతులపై సంఘవిద్రోహశక్తుల ముద్ర..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని.. ఆందోళనలను.. నిరసనలను అణిచివేయడానికి దారుణమైన పద్దతుల్ని ఎంచుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. సంఘవిద్రోహశక్తులను అణిచివేయడానికి ఉపయోగించే… ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్.. పీడీ యాక్ట్‌ను.. అమలులోకి తీసుకు వచ్చింది. ఇది రాజధాని మార్చవద్దని ఆందోళనలు చేస్తున్న చోటనే కాదు.. కొత్తగా రాజధాని పెట్టాలనుకుంటున్న విశాఖపట్నంలోనూ.. అమలులోకి తీసుకు వస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిజానికి పీడీ యాక్ట్ జాతీయ భద్రతా కోణంలోనే.. 1980లో చేశారు. అప్పట్నుంచి.. ఈ యాక్ట్‌ను…. ప్రజాందోళనలు, రాజకీయ ఉద్యమాలపై ప్రయోగించిన ఘటనలు చాలా అరుదు.

రౌడీషీటర్లు.. ఇతర సంఘ విద్రోహశక్తులుగా భావించే వారిని.. కారణం లేకుండా అదుపులోకి తీసుకునే అవకాశాన్ని.. ఈ పీడీయాక్ట్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడీ చట్టాన్ని.. అమరావతి రైతులపై ప్రయోగించి.. ఉద్యమంలో చురుగ్గా ఉన్న వారందర్నీ అరెస్ట్ చేసి.. బయటకు రాకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. లేకపోతే.. ఇప్పటికిప్పుడు.. ఈ చట్టాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం ఈ నెల ఇరవయ్యో తేదీన అసెంబ్లీ సమావేశం పెడుతోంది. పెద్ద ఎత్తున నిరసనలకు.. రాజధాని రైతులు.. విపక్ష పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. వీటన్నింటినీ నిర్వీర్యం చేసేందుకు.. ఉద్యమాన్ని నడిపిస్తున్న ముఖ్యనేతలందరిపై పీడీయాక్ట్ ప్రయోగించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రైతులను ఇప్పటికే పెయిడ్ ఆర్టిస్టులను.. మరొకటని.. వైసీపీ నేతలు.. తీవ్రంగా అవమానిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం సంఘవిద్రోహశక్తుల ముద్ర వేసి.. జైల్లో వేసేందుకు కూడా సిద్ధమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే..రాజధాని ఉద్యమం.. కొంత మంది నాయకత్వంలో నడవడం లేదని.. ఎంత మందిని జైల్లో వేస్తే.. అన్ని వేల మంది రోడ్ల మీదకు వస్తారన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని.. రైతులు హెచ్చరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆది.. పాన్ ఇండియా సినిమా

సాయికుమార్ త‌న‌యుడిగా ఇండ్ర‌స్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాల‌తో మంచి విజ‌యాలు ద‌క్కాయి. ఆ త‌ర‌వాతే ట్రాక్ త‌ప్పాడు. ప్ర‌తిభ ఉన్నా, అవ‌కాశాలు వ‌స్తున్నా స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదు. ఇప్పుడు...

దేవ‌ర‌కొండ‌.. మిడ‌ల్ క్లాస్ మెలోడీస్!

దొర‌సానితో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు కావ‌డం, రాజ‌శేఖ‌ర్ కుమార్తె హీరోయిన్ గా ప‌రిచ‌యం అవ్వ‌డంతో ఈ ప్రాజెక్టుపై ఆశ‌లు, అంచ‌నాలు పెరిగాయి. కానీ ఆ సినిమా...

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్…!

శరవేగంగా జరుగుతున్న తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. సోమవారం వరకూ కూల్చివేతలు ఆపాలని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతలు నిలిపివేయాలంటూ.. చిక్కుడు ప్రభాకర్ అనే వ్యక్తి దాఖలు...

క‌రోనా టైమ్ లోనూ… క‌నిక‌రించ‌డం లేదు!

క‌రోనా క‌ష్టాలు చిత్ర‌సీమ‌కు కుదిపేస్తున్నాయి. సినిమా రంగం ఈ ఉప‌ద్ర‌వం నుంచి ఇప్ప‌ట్లో బ‌య‌ట‌ప‌డ‌డం క‌ష్ట‌మే. చేయ‌గ‌లిగింది ఏమైనా ఉంటే, అది న‌ష్టాల్ని త‌గ్గించుకోవ‌డ‌మే. అందుకే కాస్ట్ కటింగ్‌, బ‌డ్జెట్ కంట్రోల్ అనే...

HOT NEWS

[X] Close
[X] Close