కేంద్రం చేతుల్లో లేదంటే నమ్మేస్తారా జనం..!?

భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజల దృష్టిలో ఇమేజ్ పెంచుకునే అవకాశం.. రాజధాని విషయంలో వచ్చింది. ప్రజాభిప్రాయం మేరకు.. బీజేపీ రాష్ట్ర శాఖ కూడా తమ నిర్ణయాన్ని తీర్మానంగా చేసింది. విశాఖ బీజేపీ నేతలు.. ఉత్తరాంధ్ర బీజేపీ క్యాడర్ కూడా.. అమరావతి రాజధానిని సమర్థించాయి. అంటే… రాష్ట్రం మొత్తం.. రాజధాని తరలింపు అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయని అర్థం. ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ చేయాల్సింది.. రాష్ట్రంలో పార్టీలు కాదు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి.. అమరావతి విషయంలో అడుగు ముందుకు వేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవడం. అలాంటి చర్యలు తీసుకున్నప్పుడే.. బీజేపీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది.

ఎందుకంటే.. ఇప్పటికే.. కేంద్ర పెద్దలకు చెప్పే.. అమరావతిని మారుస్తున్నామన్న ప్రచారాన్ని వైసీపీ నేతలు గుట్టుగా చేసేస్తున్నారు. వారి పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ చెబుతున్నారు. అందుకే.. ఇంత గందరగోళం జరుగుతున్నా… సాక్షాత్తూ ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని తరలించేందుకు నిర్ణయించినా.. మాట్లాడటం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తమ నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల మాదిరిగా పోరాటం చేస్తాం.. రైతులకు అండగా ఉంటామని.. మాటలు చెబితే నమ్మే పరిస్థితి లేదు. కేంద్రం తల్చుకుంటే.. ఏం చేయగలదో… అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే చూపించారు.

కేసుల లగేజీ ఉన్న.. జగన్ విషయంలో… కేంద్రం కనుసైగ చాలు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖ అభిప్రాయాన్ని.. కేంద్ర బీజేపీ పరిగణనలోకి తీసుకోకపోతే.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకపోతే.. బీజేపీ డబుల్ గేమ్ అడినట్లుగా ప్రజల్లోకి వెళ్లిపోతుంది. అదే జరిగితే.. పవన్ కల్యాణ్‌తో పొత్తు వల్ల కూడా ఒరిగేదేముండదన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గీతా ఆర్ట్స్ పేరుతో మోసం

సినిమా అవ‌కాశాల కోసం ఎదురు చూసే అమాయ‌కుల‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవ‌ల అజ‌య్ భూప‌తి పేరు వాడుకుంటూ.. త‌న‌లా అమ్మాయిల‌తో మాట్లాడుతూ, వాళ్ల‌ని లోబ‌రుచుకోవాల‌ని చూస్తున్న ఓ ముఠాపై...

రొమాంటిక్ రాధేశ్యామ్‌

జాన్‌- రాధేశ్యామ్‌.. ఈ రెండింటిటో ప్ర‌భాస్ టైటిల్ ఏమిట‌న్న ఉత్కంఠ‌త‌కు తెర ప‌డింది. చిత్ర‌బృందం రాధే శ్యామ్‌పైనే మొగ్గు చూపించింది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ని చిత్ర‌బృందం విడుద‌ల...

స్మగ్లర్‌ స్వప్నా సురేష్.. కేరళను కుదిపేస్తోంది..!

స్వప్నా సురేష్... ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్. ఆమె సూపర్ హిట్ సినిమాలో లెటెస్ట్ సెన్సేషన్ హీరోయిన్ కాదు. అంతచందాలతో ఆకట్టుకునే మరో కళాకారిణి కాదు. ప్రజలను రక్షించేందుకు ప్రస్తుత సంక్షోభంలో సర్వం...

నర్సాపురం ఎంపీ ఇక లేఖలు ఆపేస్తారా..?

రఘురామకృష్ణరాజును ఎలా కంట్రోల్ చేయాలో తెలియక వైసీపీ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆయన... వైసీపీ ఒక అడుగు వేస్తే.. ఆయన రెండు అడుగులు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తూ వస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close