శ్రీవారిపై రాజకీయాలు..! రమణ దీక్షితులు, ఐవైఆర్‌పై ప్రభుత్వం కేసులు..!!

తిరుమల శ్రీవారి కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలపై… రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. మొత్తం పరిణామాలపై.. టీటీడీ ఈవో, చైర్మన్ నుంచి నివేదిక తీసుకున్న ప్రభుత్వం.. శ్రీనివాసుడి ప్రతిష్టను పణంగా పెట్టి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని నిర్ణయించుకుంది. అందుకే ఇక ఏ మాత్రం సహించకూడదని నిర్ణయించుకుంది. కొద్ది రోజులుగా కావాలని అటు రమణదీక్షితులు, ఇటు ఐవైఆర్‌ కృష్ణారావు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో టీటీడీపై ఆనేక ఆరోపణలు చేశారు. నిజానికి వారు చేసిన ఆరోపణలు .. అనేకం వారి హయాంలో చోటు చేసుకున్నవే. అయినా అవన్నీ ఇప్పుడే జరిగినట్లు ప్రజలు భ్రమపడేలా చేస్తూ రాజకీయాలు చేయడాన్ని క్షమించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదే కాదు.. పూర్తిగా బీజేపీకి అనూలంగా వ్యవహరించి రిపబ్లిక్ టీవీలో.. టీటీడీపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అందులోనూ రమణదీక్షితులు అనేక ఆరోపణలు చేశారు. కానీ వేటికి ఆధారాలు లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి సంస్థపై నిందలేసేటప్పుడు కనీసం… నిజమా..? కాదా..? పట్టించుకోకుండా.. రాజకీయ దురుద్దేశంతో అప్రతిష్ట పాలు చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే … రిపబ్లిక్ టీవీతో పాటు, రమణదీక్షితులు, ఐవైఆర్ కృష్ణారావులపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయిచింది. వీరందరిపై… పరువు నష్టం, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేదిశగా.. టీటీడీ న్యాయవిభాగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆగమశాస్త్రానికి అపచారం చేశారని పదే పదే చెబుతున్న రమణదీక్షితులపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును అప్రతిష్ట పాలు చేసేందుకు.. శ్రీవారి ఆలయ ప్రతిష్టను మంటగలపడానికి… బీజేపీతో చేతులు కలిపిన ఐవైఆర్, రమణదీక్షితులు ఏ మాత్రం వెనుకాడకపోవడాన్ని … ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. పోటులో ఎలాంటి మరమ్మతులు జరుగుతాయో… ఇద్దరికీ తెలుసు. ఇద్దరూ టీటీడీలో పని చేస్తున్న కాలంలోనే.. జరిగిన వాటిపైనే.. ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మాట్లాడకుండా.. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వం ప్రశ్నిస్తూంటే.. దీన్ని బ్రహ్మణులపై వివక్షగా వారు … ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వివాదానికి కఠిన చర్యలతోనే పులిస్టాప్ పెట్టాలని ప్రభుత్వం డిసైడయింది. దాని ఫలితమే… పరువు నష్టం, సివిల్, క్రిమినల్ కేసులు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పులివెందుల యూరేనియం ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!

కడప జిల్లా పులివెందుల సమీపంలో ఉన్న తుమ్మలపల్లి యురేనియం ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. కంట్రోల్ చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు . యూరేనియం...

రెండు రోజుల్లోనే “కుట్ర కోణం” కనిపెట్టిన డీజీపీ..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆలయాలపై జరుగుతున్న దాడుల దర్యాప్తు విషయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న...

ఎవరూ తగ్గరు.. మరి చర్చలెందుకు..!?

కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలు చర్చల పేరుతో దాగుడు మూతలాడుతున్నాయి. ప్రజలకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడానికా అన్నట్లుగా... వారానికో సారి భేటీ అవుతున్నారు. మూడు నాలుగు గంటల పాటు సమావేశం...

సంక్రాంతి షో అంతా మెగా ఫ్యామిలీదే..!

సంక్రాంతి సంబరాలు సెలబ్రిటీలు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి సామాన్య జనానికి ఉంటుంది. అయితే ఎక్కువ మంది సెలబ్రిటీలు తాము ఎలా జరుపుకుంటామో బయటకు తెలియనివ్వరు. మెగా ఫ్యామిలీ ఈ ఏడాది మాత్రం.. తమ...

HOT NEWS

[X] Close
[X] Close