“బోస్టన్‌”కు ఏడు కోట్లు సమర్పయామి..!

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ పేరు గుర్తుందా..? అమరావతిపై జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత దాన్నే.. నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించింది. అంతకు ముందు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన ఓ బ్లూప్రింట్‌లో ప్రధానమైన భాగాలను ప్రింట్ తీసి.. నివేదిక రూపంలో ఇచ్చింది. ఆ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌నకు ఫీజు ప్రభుత్వం రూ. ఏడు కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ. మూడున్నర కోట్లకు చెక్ కూడా.. ఇచ్చేశారు. కరోనాపై చర్యలు తీసుకోవడానికి.. ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. ఫేక్ రిపోర్టులు ఇచ్చిన వారికి మాత్రం.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ… నిధులు చెల్లించేస్తున్నారు.

అసలు బీసీజీను ఎందుకు కన్సల్ట్ చేశారో.. ఎప్పుడు కన్సల్ట్ చేశారో.. ఎవరికీ తెలియదు. అసెంబ్లీలో జగన్ ప్రకటించిన తర్వాత .. ఇచ్చారేమో అనుకున్నారు. అయితే.. కోట్లు ఆఫర్ చేశారని మాత్రం ఎవరికీ తెలియదు. తీరా బోస్టన్ గ్రూప్ .. ప్రభుత్వానికి కావాల్సిన నివేదిక ఇచ్చిన తర్వాత .. ఆ సంస్థతో జరిపిన సంప్రదింపులంటూ.. కొన్ని మెయిల్స్ లీకయ్యాయి. వాటిలో ఆ సంస్థకు …రూ. ఐదు కోట్ల 95 లక్షలుగా ఫీజుగా నిర్ధారించారు. ఎలాంటి జీవో లేకుండా… బోస్టన్‌కు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతలు ఇచ్చిన ప్రభుత్వం.. ఫీజుగా రూ. 5 కోట్ల 95 లక్షలు ఇస్తామని అంగీకరించింది. కానీ ఇప్పుడు అది ఏడు కోట్లు దాటిపోయింది. ఎందుకు అంటే.. వారు కట్టాల్సిన జీఎస్టీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందట. అంటే.. ఫీటు పోటుకు పన్నులు ఎక్స్‌ట్రా అన్నమాట.

ప్రపంచంలో ఇంత వేగంగా .. అత్యంత విశాలమైన సబ్జెక్ట్ పై నివేదిక రూపొందించిన కంపెనీ ఇంకొకటి ఉండదు. తమకు కావాల్సిన నివేదిక కోసం.. 2019 నవంబర్‌ 27న ..వారి కంపెనీని ఎంపిక చేసినట్లుగా బోస్టన్ కమిటీకి ప్రభుత్వం సమాచారం పంపింది. జనవరి 3వ తేదీన బోస్టన్ కమిటీ నివేదిక ఇచ్చేసింది. అంటే… ప్రభుత్వం ఎంపిక చేసినట్లుగా తెలిపిన తర్వాత కేవలం.. నెల అంటే.. నెల రోజుల్లోనే… బోస్టన్ కమిటీ నివేదిక సమర్పించింది. ఇందులో క్రిస్మస్ హాలీడే.. న్యూ ఇయర్ హాలీడేస్.. అన్నీ ఉన్నాయి. అసలు ఆ కమిటీ ఏపీలో ఏ పరిస్థితుల్ని అధ్యయనం చేసిందో ఎవరికీ తెలియదు. ఎక్కడ పర్యటించిందో కూడా తెలియదు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చాక… నెలలో రిపోర్ట్ ఇచ్చిన బీసీజీ ఏడు కొట్లు ప్రజాధనాన్ని జేబులో వేసుకుంది. దానికి కట్టాల్సిన పన్నులు కూడా.. ప్రజాధనాన్నే ముక్కు పిండి వసూలు చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close