ఎవరూ కాపాడరు.. మీకు మీరే కాపాడుకోవాలి..!

మేం చేయాల్సింది చేస్తాం.. కట్టడి చేయాల్సింది ప్రభుత్వమే..! .. అన్నట్లుగా ఉంది.. జనం తీరు. ప్రభుత్వాలేమీ ప్రజలపై కక్షతో.. వారిని నిర్బంధించడం లేదు. ప్రజల కోసమే ఆంక్షల్ని విధిస్తున్నారు. బయటకు వస్తే పెను ముప్పు పొంచి ఉందని.. తేలడంతోనే.. ఈ లాక్‌డౌన్‌లు.. కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు.. సంపాదన గురించి ఆలోచించే పరిస్థితి లేదు. బతికుంటే బలుసాకు అయినా తిని బతక వచ్చు అనే పరిస్థితికి ప్రపంచం వచ్చేసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్.. మరో తెలంగాణ పరిస్థితి కాదు ఇది. మొత్తం ప్రపంచానికి ప్రాణభయం పట్టుకుంది. సగం ప్రపంచం లాక్ డౌన్ అయిపోయింది.

బతికుంటే బలుసాకు అయినా తిని బతకొచ్చనే స్టేజ్‌కి ప్రపంచం..!

ఏ దేశంలో అయినా ప్రజల్లో సహజమైన నిర్లక్ష్యం ఎక్కువ. కొన్ని దేశాల్లో అతి జాగ్రత్తలు ఎక్కువ. మరికొన్ని దేశాల్లో జనం.. మంచీ చెడూ ఆలోచికుంటూ ఉంటారు. ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు… సోషల్ మీడియా వల్ల.. సగం తెలిసి.. సగం తెలియని విషయాలతో… ఆ ఏమవుతుందిలే..? అనుకుని.. నిప్పులపై చేతులు పెట్టడానికి కూడా సిద్ధమయ్యే వారు ఎక్కువ మంది ఉంటారు. ప్రత్యక్షంగా కనిపిస్తున్నా.. సహజమైన నిర్లక్ష్యం కారణంగా .. ప్రమాదంలో పడటానికి వెనుకాడని జనం.. ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుపై పోరాటంలో మాత్రం.. ఆ అది మమ్మల్నేం చేస్తుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వాల ఆదేశాలను వారు లైట్ తీసుకుంటూడటమే దీనికి సాక్ష్యం.

ప్రభుత్వాలు చెబుతోంది ప్రజల కోసం.. అంటే మన కోసమే..!

అనుభవమైతేనే తత్వం బోధఫడుతుందని.. ప్రజలు వినట్లేదు కదా అని ప్రభుత్వాలు కూడా.. ఇప్పుడు లైట్ తీసుకోవడానికి లేదు. ఒక్క సారి కరోనా వచ్చిన అనుభవం తెలిసిన తర్వాత తత్వం తెలుసుకుని … ఆ తర్వాత పద్దతులు మార్చుకోవడానికి .. జనం మిగిలే పరిస్థితి కనిపించని.. ఘోరకలి ఎదురుగా వచ్చేసింది. నేర్చుకోవడానికి .. మార్చుకోవడానికి సమయం లేదు. ముందస్తు జాగ్రత్త పడటమే ముఖ్యం. బాధ్యత లేకుండా రోడ్లపైకి వస్తే.. విరగ్గట్టడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే.. దొరికితే కొడతారు.. లేకపోతే తిరిగేయవచ్చు అనుకోవడమే… అసలు తప్పిదం. ఇక్కడ అదే జరుగుతోంది. తెలుసుకోవాల్సింది జనమే.

ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ చూపడమే అతి పెద్ద దేశభక్తి..!

కరోనా అనేది ఒకరి తప్పుల వల్ల వారికి మాత్రమే.. కాదు.. చుట్టుపక్కల వారందరికీ వ్యాపించే వైరస్. నీ జాగ్రత్తలో నీవుంటే కాదు… పక్కనోళ్లు అజాగ్రత్తగా ఉన్నా… అంటుకుంటుంది. అంటే.. ఇక్కడ తప్పు నీదా..నాదా అన్నది కానే కాదు. తప్పు ఎవరిదైనా.. అందరూ భరంచాల్సి వస్తుంది. ఇప్పుడు దేశభక్తి చూపించాల్సింది.. జై భారత్ మాత నినాదాలతోనో.. ఐ లవ్ మై ఇండిాయ పాటలతోనో కాదు… దేశంపై దండెత్తుతున్న ఓ మహమ్మారిని అడ్డుకోవడానికి తెగువ చూపించడం. దాని కోసం.. కత్తిడాలు పట్టుకుని యుద్ధాలు చేయడమనడం లేదు. ఇంట్లోనే కదలకుండా కూర్చోవడమే అతి పెద్ద పోరాటం. మరి దీన్ని అయినా చేస్తారా..? లేక.. కనీస బాధ్యత లేకుండా రోడ్ల మీదకొచ్చేస్తారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close