“ఐటీ గ్రిడ్” కేసు ఏపీకి బదిలీ చేయాలని కోర్టుకెళ్లనున్న ఏపీ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల సమాచారం.. చోరీ అయిందంటూ.. వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదుపై తెలంగాణ పోలీసులు.. అత్యంత ఉత్సాహం చూపించారు. ఉన్న పళంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సోదాలు చేశారు. తమకు ఏదో కావాలన్నట్లుగా.. అర్థరాత్రి సోదాలు చేసి.. హార్డ్ డిస్కులు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకెళ్లారు. తమ పార్టీకి చెందిన డేటా చోరీ చేయడానికే… వైసీపీ నేతలు .. టీఆర్ఎస్ సర్కార్‌తో కుమ్మక్కయి ఈ దాడులు చేశారని… టీడీపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్‌తో గంట పాటు ప్రత్యేకంగా సమావేశమై.. న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో… సూచనలు చేశారు. దీని ప్రకారం.. కేసు ఏపీకి బదిలీ చేయాలనే పిటిషన్… వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విజయసాయిరెడ్డి, లోకేశ్వర్ రెడ్డి .. ఇద్దరూ… ఏపీ ప్రభుత్వ అధికారిక సమాచారం.. ఐటీ గ్రిడ్ కంపెనీ దొంగిలించిందని… ఫిర్యాదు చేశారు. అంటే.. అది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. దానిపై ఆధారాలు ఉన్నాయా లేదా అన్నది తెలంగాణ పోలీసులు చూసుకోలేదు. కానీ ఫిర్యాదు మేరకు.. ఐటీ కంపెనీలో సోదాలు చేశారు. ఇప్పుడు.. దీన్నే ఏపీ ప్రభుత్వం అస్త్రంగా చేసుకోబోతోంది. తమ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం దొంగిలించిందని వచ్చిన ఫిర్యాదు కాబట్టి.. తాము విచారణ చేయించుకుంటామని.. ఆ కేసును ఏపీకి బదిలీ చేయాలని.. అడిగే అవకాశం కనిపిస్తోంది. డేటా చోరీ.. హైదరాబాద్ కేంద్రంగా జరిగిందని చెబుతున్నప్పటికీ.. తమ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కాబట్టి…అసలు దొంగతనం జరిగిందా లేదా అన్నది తాము మాత్రమే నిర్దారించగలం కాబట్టి.. ఆ కేసును.. ఏపీకి బదిలీ చేయమని.. పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. సాంకేతికంగా.. ఈ కేసు ఏపీకి బదిలీ చేయడమే కరెక్టని న్యాయనిపుణులు కూడా.. విశ్లేషిస్తున్నారు.

ఏపీకి కేసు బదిలీ అయితే ఏమవుతుంది..?. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ జుట్టు కచ్చితంగా .. ఏపీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చినట్లే అవుతుంది. ఏ ఆధారాలతో కేసు వేశారో.. అన్నదాని దగ్గర్నుంచి..ఆ కంపెనీపై.. అంత దుందుడుకు చర్యలు ఎందుకు తీసుకున్నారు..? ఆ కంపెనీ నుంచి సేకరించిన సమాచారం బయటకు పంపారా..? అలా పంపితే.. ఇలా చేయమని చెప్పిందెవరు..? లాంటివన్నీ బయటకు వస్తాయి. అదే సమయంలో.. తెలంగాణ పోలీసుల అత్యాత్సాహాన్నీ… సాక్ష్యాలతో సహా బయటపెట్టే అవకాశం ఉంది. ఈ కేసు కనుక ఏపీకి బదిలీ అయితే.. టీడీపీ దగ్గర్నుంచి కేసీఆర్ రివర్స్ గిఫ్ట్ తీసుకున్నట్లు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close