ప్రొ.నాగేశ్వర్ : యుద్ధం వస్తుందని పవన్ కల్యాణ్‌కి ముందే తెలుసా..?

సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాజకీయాలు కూడా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్… యుద్ధం వస్తుందని తనకు రెండేళ్ల కిందటే చెప్పారంటూ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌లోనూ ప్రముఖంగా ప్రచారమయ్యాయి. నిజానికి ఇది రెండేళ్ల నుంచి అందరూ అనుకుంటున్నదే. ఎన్నికలకు ముందు సరిహద్దుల్లో ఉద్రిక్తల్లాంటివి ఉంటాయని.. వాటిని చూపించి రెచ్చగొట్టి.. ఓట్ల వేటకు వస్తారని చాలా మంది అనుకున్నారు.

ఎన్నికలకు ముందు యుద్ధవాతావరణంపై రెండేళ్ల నుంచి చర్చలు..!

రెండేళ్ల నుంచి ఏదో విధంగా.. ఎన్నికలకు ముందు యుద్ధం అనే అంశం చర్చల్లోకి వస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఈ ఉద్దేశంతోనే చెప్పి ఉంటారు. కశ్మీర్‌లో పుల్వామా దాడిలో… 42 మంది జవాన్లు మరణించి ఉండకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా.. ! . అయితే భారతీయ జనతా పార్టీ నేతలు ఈ పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికే ప్రాముఖ్యతనిస్తున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తమకు లాభమన్నట్లుగా.. మోడీ ప్రచారసభలు ఎక్కడా ఆపలేదు. అమిత్ షా దేశాన్ని కాపాడేది మేమేనంటూ దేశం మొత్తం తిరుగుతున్నారు. యడ్యూరప్ప లాంటి వాళ్లు.. ఎయిర్ స్ట్రైక్స్ వల్ల సీట్లు పెరుగుతాయని బహిరంగంగానే లెక్కలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలపై విమర్శల్లో పాకిస్తాన్ ను చొప్పించి..మోడీ విమర్శలు చేస్తున్నారు. అంతా పాకిస్తాన్ ఏజెంట్లు అన్నట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. దేశభక్తి అంటే.. తమ ఒక్కరి సొంతం అన్నట్లుగా బీజేపీ నేతల శైలి ఉంది. పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారు. దేశభక్తి.. బీజేపీ నేతల సొంతమన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రజల దేశభక్తిని శంకిస్తున్న బీజేపీ..!

దేశ ప్రజల దేశభక్తికి.. ప్రస్తుతం బీజేపీ నేతలు శీలపరీక్ష పెడుతున్నారు. రాజకీయ పార్టీ నేతలకు, పత్రికలు, విశ్లేషకులు, ప్రజలకు దేశభక్తి పరీక్షలు పెడుతున్నారు. పేపర్లు బీజేపీ నేతలు దిద్దుతున్నారు. వారు సర్టిఫికెట్ ఇస్తేనే దేశభక్తి ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే… అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు వస్తుందన్న పరిస్థితుల్ని తెచ్చి పెడుతున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా ఇదే తరహాలో అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకన్నాడు.. ఉద్దేశం అనేది.. వన్ కల్యాణే చేప్పాలి. కానీ అసలు ముందుగాే యుద్ధం అనే మాటాలు వినిపించడానికి.. బీజేపీ నేతల తీరే కారణం అని చెప్పక తప్పదు. ప్రతి ఒక్కరి దేశభక్తిని శంకించింది.. తమకు మద్దతివ్వని వాళ్లంతా.. దేశభక్తులు కాదన్నట్లుగా చెప్పుకోవడం వల్లే అసలు సమస్య వస్తోంది. చివరికి మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రుల దేశభక్తిని కూడా శంకించడం అంత దారుణం ఇంకోటి ఉండదు.

విపక్షాలన్నింటినీ పాకిస్తాన్ ఏజెంట్లుగా చెప్పడం దేశాన్ని అవమానించడమే..!

విశాఖలో మోడీ.. మహాకూటమిని దేశద్రోహకూటమిగా చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్‌ను పాకస్తాన్ కోడ్ అంటున్నారు. చంద్రబాబును పాకిస్తాన్ ఏజెంట్ అంటున్నారు. బీజేపీ నేతలు అవమానిస్తున్నది వీరిని కాదు. వీరిని ఓటేస్తున్న రెండు కోట్ల మంది ప్రజల్ని అవమానిస్తున్నారు. ఇలా ఏపీలోనే… రెండు కోట్ల మంది ఉంటే.. దేశవ్యాప్తంగా విపక్షాలకు ఓట్లేసవాళ్లంతా దేశద్రోహులేనా..? ఎన్నికల్లో 31 శాతం ఓట్లు బీజేపీకి వచ్చాయి. మిగతా 69 శాతం మంది దేశద్రోహులేనా..? దేశంలో ఏకపక్షవాదం ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఇలా మాట్లాడటం వల్ల ఎవరికి లాభం. ఇది చాలా ప్రమాదకరమైన రాజకీయం. బీజేపీ నేతల దేశభక్తిని ఎవరూ శంకించలేదు. వారు.. కూడా.. దేశ ప్రజల దేశభక్తిని శంకించకూడదు. గుజరాత్‌లో చూశారం.. ఆర్మీ చీఫ్‌గా చేసిన వ్యక్తి దేశభక్తిని కూడా శంకించారు. అంత ఎందుకు.. నితీష్ కుమార్ గెలిస్తే.. పాకిస్తాన్‌లో స్వీట్లు పంచుకుంటారని.. అమిత్ షా ప్రచారం చే్శారు. మరి అలాంటి పాకిస్తాన్ ఏజెంట్‌తో… బీజేపీతో ఎందుకు కలిసింది..?. ఇదెక్కడి న్యాయం. సరిహద్దు ఉద్రిక్తల్లో.. విపక్ష పార్టీలన్నీ… కేంద్రానికి అండగా నిలబడ్డాయి. ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిచ్చాయి. కానీ మోడీ మాత్రమే వేరుగా మాట్లాడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.