“ఫామ్‌ 7″లపై ఎన్నికల సంఘం సీరియస్..! ఎక్కడికక్కడ కేసులు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అనూహ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీపై ఎప్పుడైనా ఓట్ల తొలగింపు ఆరోపణలు వస్తాయి. కానీ.. ఏపీలో మాత్రం.. తమ ఓట్లు తొలగిస్తున్నారని.. అధికార పార్టీనే ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్ పత్రాల విషయంలో.. ఫామ్‌ 7 అంటేనే ఎవరికీ తెలియదు. కానీ… కొద్ది రోజులుగా.. మండలాల వారీగా ఈ ఫామ్‌ -7ల విప్లవం ఏపీలో నడిచింది. ఫలానా ఓటు తొలగించాలంటూ.. అభ్యర్థించేందుకే ఈ ఫామ్ -7. మండలాల వారీగా తెలుగుదేశం పార్టీ ఓటర్లుగా ఉన్న వారని… వారి సభ్యత్వాల ఆధారంగా గుర్తు పట్టినట్లుగా.. ప్రత్యేకంగా ఆ ఓట్లు తొలగించాలంటూ.. ఆన్‌లైన్‌లో ఫామ్‌-7లు అప్లయ్ చేశారు. అవి ఒక్కో మండలంలో వందలు, వేలు దాటిపోవడంతో.. వ్యవహారం బయటకు వచ్చింది.

చంద్రగిరి నుంచి ఇచ్చాపురం వరకు .. టీడీపీ నేతలకు.. ఈ ఫామ్‌ -7ల వ్యవహారంలో తమ పార్టీ ఓటర్లను టార్గెట్ చేసినట్లు తెలిసిపోయింది. దీనిపై ఉన్న పళంగా ఆందోళనలు ప్రారంభించారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని.. ఈసీ అధికారులకు అందించారు. ఒక్కో వ్యక్తి నాలుగు ఐదు వందల ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు చేశారు. అయితే అలాంటి వారు.. తాము చేయలేదంటున్నరు. ఇదంతా.. కుట్ర పూరితంగా… జరిగిందని.. ఫిర్యాదులు అందడంతో.. ఏపీ ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. తప్పుడు ఫామ్‌-7లు దరఖాస్తు చేసిన వారిపై.. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు. క్రిమినల్ కేసులు పెడుతున్నారు.

ఇప్పటికి ఏపీ వ్యాప్తంగా 45 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఇలా దరఖాస్తు చేసిన ఐపీ అడ్రస్‌లు సేకరిస్తున్నామని, విచారణ జరపాలని పోలీస్‌ శాఖను కోరామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు మీ సేవా సిబ్బంది హస్తం ఉందని తేలిందన్నారు. మొత్తానికి ఈ ఓట్ల తొలగింపు వెనుక ఎరున్నారనేది.. త్వరలోనే బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయ దుమారం రేగడం కూడా ఖాయమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close