ఏపీ కొత్త రాజధాని ఎంపికకు నిపుణుల కమిటీ..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చే ఉద్దేశంలో ఏపీ సర్కార్ ఉందని.. ఇప్పటికే ఆ మేరకు ప్రత్యక్ష ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని .. ప్రభుత్వం నేరుగానే ప్రకటించింది. నిపుణుల కమిటీ ఎక్కడ ఏర్పాటు చేయమంటే రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడమే దీనికి కారణం. అసలు కొత్త రాజధాని నిర్మాణానికి నిపుణుల కమిటీని ఎప్పుడు నియమించారో. ఎవరికీ తెలియదు. ఆ నిపుణుల కమిటీ పని ప్రారంభించినట్లుగా… ప్రభుత్వం తాజాగా మీడియాకు సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 13వ తేదీన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఆ తర్వాత ఇంత వరకూ ఒక్క సారి కూడా ఈ కమిటీ సమావేశం కాలేదు. బుధవారమే… విజయవాడలో తొలి సమావేశం జరిపినట్లుగా.. ప్రభుత్వ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. అందరి అభిప్రాయాలు సేకరించి…, అన్ని చోట్లా అనుకూలతలను గుర్తించి… రాజధానిని సిఫార్సు చేస్తుందని చెబుతున్నారు. అంటే.. ప్రభుత్వానికి రాజధాని మార్చే ఉద్దేశం మొదటి నుంచి ఉందని.. అమరావతి నిర్మాణానికి పనికి రాదని చెప్పి.. ఆ మేరకు నిర్ణయం తీసుకోవడానికే ఇంత కాలం ఆగారన్న అభిప్రాయం.. ప్రభుత్వం తాజా లీకులతో స్పష్టమవుతోంది. అయితే పది లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా అమరావతికి వరద రాకపోవడం… ఇతర చోట్ల.. రాజధాని పెడితే.. అంతా గందరగోళం అయిపోతుందన్న అభిప్రాయం ఉండటంతో.. ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన లేదని.. కచ్చితంగా అమరావతి మార్పు ఖాయమని తాజా పరిణామాలతో తెలుస్తోంది.

ఓ కుక్కను చంపాలంటే.. ముందుగా దానిపై పిచ్చిదనే ముద్రవేయాలంటారు. ఇప్పుడు..అదే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అమరావతిపై ఎన్ని రకాల ప్రచారాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. తాజాగా అక్కడ జరుగుతున్న రూ. 39వేల కోట్ల పనుల్లో రూ. 30వేల కోట్లు దుబారా అని జగన్ బంధువు రేమండ్ పీటర్ నేతృత్వంలోని కమిటీ తీర్పిచ్చేసింది. అంతే కాదు.. అన్నీ నిబంధనలకు విరుద్ధమని చెప్పేసింది. ఈ పీటర్.. రాజధానిని నిర్ణయించే… జీఎన్ రావు కమిటీలో కూడా సభ్యుడు. రూ. 39వేల కోట్లు ఖర్చు పెట్టకుండానే.. రూ. 30వేల కోట్లు దుబారా అయ్యాయని రిపోర్ట్ ఇవ్వడం ఒక వింత అయితే… అన్నింటినీ సమీక్షించాలని.. సిఫార్సు చేయడం మరొక వింతన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నిర్మాణాలు ఇక్కడితో నిలిపివేస్తే.. వృధా అయ్యే ప్రజాధనమే ఎక్కువ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close