చానళ్ల పునరుద్ధరణ..! అధికారంపై మీడియా విజయం..!

టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లను ఎంఎస్‌వోలు పునరుద్ధరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫైబర్ నెట్ కూడా.. ప్రసారాలు చేస్తోంది. ఇది అధికారంపై మీడియా సాధించిన విజయం. అధికారం ఉంది కదా.. అన్ని అన్ని వ్యవస్థలపై సవారీ చేస్తామని విర్రవీగడం సాధ్యం కాదని.. నిరూపించడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రోజునే… అదే వేదిక పై నుంచి.. వ్యతిరేక కథనాలు రాస్తే సంగతి చూస్తామంటూ హెచ్చరించారు. దానికి తగ్గట్లుగానే తర్వాతి పరిణామాలు ఉన్నాయి. పలువురు జర్నలిస్టులు దాడులకు గురయ్యారు. హత్యలు కూడా జరిగాయి. అదే సమయంలో చానళ్లను బ్యాన్ చేశారు. వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ.. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను ఫైబర్ నెట్ ను తొలగించడమే కాకుండా.. ఎంఎస్‌వోలను బెదిరిచి మరీ… ఆ రెండు చానళ్లు రాకుండా చేశారన్న ప్రచారం జరిగింది.

మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నించిన తీరుపై.. మీడియా సంస్థలు భగ్గమన్నాయి. జర్నలిస్టులు రోడ్డెక్కారు. అదే సమయంలో.. ఆ సంస్థలన్నీ.. ఢిల్లీలోని రెగ్యులేటరీ సంస్థలకు ఫిర్యాదు చేశాయి. దీనిపై టీడీశాట్ శరవేగంగా స్పందించింది. చకచకా విచారణ జరిపింది. ప్రభుత్వం కుట్ర పూరితంగా.. ఈ చానళ్లను నిలిపివేయించిందని గుర్తించి.. దానికి తగ్గట్లుగా.. ఆదేశాలు ఇచ్చింది. తమ ఆదేశాలను లైట్ తీసుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వానికి జరిమానాతో షాక్ ఇచ్చింది. ఎంఎస్‌వోలకూ అదే తరహా ట్రీట్ మెంట్ ఎదురయింది. వారికి ఇప్పుడు జరిమానాలు పడ్డాయి. వాటిని ఉల్లంఘిస్తే… లైసెన్సులు రద్దయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

దేశంలో మీడియా స్వేచ్ఛ అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పడిందని ఏపీలోని పరిణామాలను బట్టి తెలిసిపోతోంది. మీడియా… తనకు తెలిసిన సమాచారాన్ని వెల్లడించడానికి కూడా.. భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆధారాల్లేకపోతే కేసులు పెడతామంటూ.. ఇటీవల ఏపీ సర్కార్ ఓ జీవో తెచ్చే ప్రయత్నమే చేసింది. ఇవన్నీ.. అధికార అసహనానికి ప్రతీకలనే అభిప్రాయం… మీడియా ప్రపంచంలో ఉంది. ఇప్పుడు.. వీటిపై.. మీడియా తొలి విజయం సాధించింది. అణచివేతకు ప్రయత్నిస్తే.. అంతకు మించి.. ఎదుగుతామని.. మీడియా చెప్పకనే చెప్పింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close