ఏపీలో వాళ్లు విధులు ఎగ్గొడితే జైలే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. ఆరోగ్య, ఆత్యవసరానికి సంబంధించిన ప్రభుత్వ ప్రైవేటు సర్వీసులన్నింటినీ ఎస్మా పరిధిలోకి తెస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 నెలల పాటు ఎస్మా చట్టం అమలులో ఉంటుంది. ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని.. శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని జీవోలో హెచ్చరించారు. ఎస్మా పరిధిలోకి వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య సేవల్లోని పారిశుద్ధ్య సిబ్బంది కూడా వస్తారు. అలాగే.. వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణాను కూడా.. ఎస్మా పరిధిలోకి చేర్చారు.

మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులు.. మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రతా సంస్థలు, ఆహార సరఫరా… బయో మెడికల్‌ వేస్ట్‌ నిర్వహణ కూడా..ఎస్మా పరిధిలోకి వచ్చింది. పెద్ద ఎత్తున కేసులు బయటపడుతున్న సమయంలో ఎవరూ విధులకు.. డుమ్మా కొట్టకుండా ఈ జీవోను జారీ చేసినట్లుగా చెబుతున్నారు. వైద్య, ఆరోగ్యసిబ్బందికి కూడా ప్రభుత్వం సగం చొప్పునే చెల్లిస్తోంది. అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్సకు సహకరించవనే అభిప్రాయం వినిపిస్తోంది.అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిచిందన్న భావన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే..అన్ని జిల్లాల్లోని 50… అంతకన్నా ఎక్కువ పడకల సామర్థ్యం కలిగిన ప్రైవేటు ఆసుపత్రులన్నింటినీ జాతీయ విపత్తుల చట్టం కింద స్వాధీనం చేసుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. వాటన్నింటినీ కరోనా చికిత్సకోసమే ఉపయోగించాలని నిర్ణయించారు. ఇప్పుడు సిబ్బందిపై ఎస్మా ప్రయోగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా...

HOT NEWS

[X] Close
[X] Close