ఓటీటీలో… విశ్వ‌క్ ఎంట్రీ!

సినిమాకి పోటీగా, ధీటుగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ త‌యార‌వుతున్నాయి. భారీ బడ్జెట్లు, అదిరిపోయే కాస్టింగ్‌, దిమ్మ తిరిగే కంటెంట్ తో వెబ్ సిరీస్ లు ఆక‌ట్టుకుంటున్నాయి. న‌వ‌త‌రం హీరోల‌కూ ఈ వెబ్ సిరీస్‌లు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాయి. భారీ పారితోషికాలు వ‌స్తుండ‌డంతో… వాళ్లూ వెబ్ సిరీస్ ల‌లో న‌టించ‌డానికి మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా విశ్వ‌క్ సేన్ కూడా త్వ‌ర‌లోనే వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆ విష‌యాన్ని విశ్వ‌క్ కూడా ధృవీక‌రించాడు. త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నాన‌ని, ఆ కంటెంట్ మ‌హా స్ట్రాంగ్‌గా ఉంటుంద‌ని, క‌థ న‌చ్చ‌డం వ‌ల్లే… వెబ్ సిరీస్ చేయ‌డానికి ఒప్పుకున్నాన‌ని క్లారిటీ ఇచ్చాడు.

మ‌రో విష‌యం ఏమిటంటే.. `పెళ్లి చూపులు` ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. `ఈ న‌గ‌రానికి ఏమైంది` పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొంద‌నుంది. ఈ పేరుతో ఓ సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో విశ్వ‌క్ సేనే క‌థానాయకుడు. బ‌హుశా… విశ్వ‌క్ న‌టించబోయే వెబ్ సిరీస్ కూడా అదే అయ్యుంటుంది. సినిమాల‌కు సీక్వెల్స్ రావ‌డం స‌హజ‌మే. వెబ్ సిరీస్‌ల‌కు కూడా సీజ‌న్‌ల పేరుతో సీక్వెల్స్ వ‌స్తుంటాయి. అయితే ఓ సినిమాకి సీక్వెల్ గా ఓ వెబ్ సిరీస్ రావ‌డం మాత్రం కొత్తే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

టీటీడీ వద్ద రూ. 50 కోట్ల పాత నోట్లు..!

కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని ఎలాగోలా ఇతర వనరుల ద్వారా సమకూర్చుకోవాలనుకుంటున్న టీటీడీ చైర్మన్‌కు.. పాత నోట్లు.. గుట్టల్లా పడి ఉండటం కనిపించాయి. వాటి విలువ రూ. యాభై...

మరో మూడు రోజులు స్టే..! కూల్చివేత.. ఆగితే సాగదు..!

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇచ్చిన స్టే ఆర్డర్స్‌ను.. హైకోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. కూల్చివేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కాపీని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల పాటు స్టే...

మీడియా వాచ్‌: ఈనాడులో గంద‌ర‌గోళం

తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకుని, త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌డంలో ఈనాడుకి తిరుగులేదు. ప‌దేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవ్వ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close